Today rashi phahalu – 23 జనవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల మిత్రులు మీకు బహుమతులు అందిస్తారు. మీ ఆశయాల సాధనలో బంధువులు సహకరిస్తారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధ్యపడతాయి. మహిళలు బంధువుల ద్వారా గౌరవం పొందుతారు. అనుకూల రంగులు…….. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. మీ ప్రయత్నాలలో కొన్ని సమస్యలు. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని సమస్యలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, వైద్యులకు ఇబ్బందికరమైన వాతావరణం. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…….. గోధుమ, ఎరుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కార్యక్రమాలలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కొత్తగా రుణాల కోసం యత్నిస్తారు. ఆత్మీయులతో కలహాలు. కాంట్రాక్టులు తప్పిపోతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బందిపడతారు. రాబడి సామాన్యంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణ కష్టసాధ్యం కాగలదు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొన్ని పర్యటనలు వాయిదా. విద్యార్థులు శ్రమ ఫలించక నిరుత్సాహపడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు……… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం మరింత ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మీ అంచనాలు నిజమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులు ఒక సంతోషకర విషయం తెలుసుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు పుట్టింటి తరఫు నుండి కొంత లాభాలు. అనుకూల రంగులు…….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గాయత్రీ దేవిని పూజించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక వ్యవహారాలు మీ అంచనాల మేరకు ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులు పనిభారం తగ్గి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు యోగదాయకమైన కాలం. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు…….. బంగారు, తెలుపు, ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం రాక డీలా పడతారు. ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. సోదరులు, స్నేహితులతో కలహాలు. భవిష్యత్తుపై కొంత ఆందోళన చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు విధులు కొంత మారవచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థులు మరింత శ్రద్ధతో ముందుకు సాగాలి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనుకూల రంగులు…….. కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఇబ్బందులు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొత్త విధులు. క్రీడాకారులు, వైద్యులకు శ్రమాధిక్యం. విద్యార్థులు కొన్ని అవకాశాలపై ఆశలు వదులుకోవాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు………. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగయత్నాలు సానుకూలం. సమాజంలో గౌరవమర్యాదలు దక్కించుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు ఊహించని ఇంటర్వ్యూలు అందుతాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు…….. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…కాఫీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ప్రయాణాలలో ప్రతిబంధకాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులు, స్నేహితులతో అకార ణంగా విరోధాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు. ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు దొర్లవచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు అవకాశాలు తగ్గుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు……… పసుపు, బంగారు. ప్రతికూల రంగు…తెలుపు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. బం«ధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను విస్తరిస్తారు. ఉద్యోగులు కీలక సమాచారం అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవర్తమానాలు. విద్యార్థులు కొన్ని అరుదైన అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం. అనుకూల రంగులు….. గోధుమ, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. కనకధారా స్తోత్రం పఠించాలి.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శ్రమ కొంత తప్పదు. బంధువర్గంతో విభేదిస్తారు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. మీ కష్టానికి తగ్గ ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో వివాదాలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…ఎరుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం మీ అంచనాల మేరకు పెరుగుతుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులను కైవసం చేసుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. స్థిరమైన ఉద్యోగం లభించవచ్చు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త ఆశలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. మహిళలకు పురస్కారాలు. అనుకూల రంగులు……… కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…నీలం. దుర్గాదేవిని పూజించాలి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com