Today rashi phahalu – 26 జనవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
సంఘంలో ప్రత్యేక గుర్తింపు తథ్యం. కీలక సమాచారం అంది ఊపిరిపీల్చుకుంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. మీ యత్నాలకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరింత సానుకూలం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు ఆస్తిలాభం. అనుకూల రంగులు……..ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వస్తువులు సేకరిస్తారు. మీ ఆలోచనలు బంధువులతో పంచుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు వృథా కావు. ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ముందడుగు వేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు తథ్యం. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు… గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనాలు, విలువైన గృహోపకరణాలు కొంటారు. అప్రయత్న కార్యసిద్ధి. కాంట్రాక్టులు కాస్త ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అభివృద్ధి పథంలో సాగుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కొత్త ఆశలతో అడుగులు వేస్తారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు విజయాలు తథ్యం. అనుకూల రంగులు… కాఫీ, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. బంధువుల నుంచి విమర్శలుు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార, వాణిజ్యవేత్తలు నిదానం పాటించడం ఉత్తమం. ఉద్యోగులకు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులు కొంత నిరాశకు గురవుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. ఎరుపు, లేత గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణేశ్ స్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. స్నేహితులతో అనుకోని విభేదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దైవచింతనతో గడుపుతారు. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. వ్యాపార, వాణిజ్యవేత్తల ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగులకు ఊహించని విధంగా మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఆటుపోట్లు మధ్య గడుపుతారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు.. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
సమాజంలో విశేషమైన గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు స్థిరాస్తి లాభం. అనుకూల రంగులు… కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూలరంగు…తెలుపు. వేంకటేశ్వర స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఖరీదైన వాహనాలు కొంటారు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో చికాకులు అధిగమిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఊహించని లాభాలు రాగలవు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు సమస్యల నుండి గట్టెక్కుతారు. మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు. అనుకూల రంగులు… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు..ఎరుపు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. కష్టపడ్డా ఫలితం నామమాత్రమే. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో కొన్ని పొరపాట్లు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడుల మధ్య గడుపుతారు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కొత్త చిక్కులు. అనుకూల రంగులు……..నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. శ్రీ మీనాక్షిస్తుతి మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో శ్రమ. పాత సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల పై అంతగా ఆశలు పెట్టుకోవద్దు. ఉద్యోగులకు విధి నిర్వహణపై గందరగోళం. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. విష్ణు ధ్యానం చేయండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
చిరకాల మిత్రుల కలయిక. అనుకున్న కార్యక్రమాలు విజయపథంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ఎటువంటి సమస్య ఎదురైనా పరిష్కరించుచకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన లబ్ధి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సత్తా చాటుకునే సమయం.. పారిశ్రామికవేత్తలు, వైద్యుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది అనుకూల రంగులు……. నీలం, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. శివాష్టకం పఠించండి.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి విమర్శలు. మీ కష్టం అంతగా ఫలించదు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టడం మంచిది. ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిదానం అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. మహిళలకు చికాకులు తప్పవు. అనుకూల రంగులు… పసుపు, గోధుమ. ప్రతికూల రంగు…తెలుపు. శివ పంచాక్షరి పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజసేవలో మీ వంతు పాత్ర పోషిస్తారు. స్నేహితుల నుండి మాటసాయం అందుతుంది. రాబడి పై ఆందోళన తొలగుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు విస్తృతపరుస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com