Today rashi phalalu – 27 ఫిబ్రవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. దేవాలయాలు సందర్శిస్తారు. ఆస్తి విషయాల్లో వివాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగాల్లో పై స్థాయి నుంచి ఒత్తిడులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూలం… తెలుపు, ఎరుపు. ప్రతికూలం…నీలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆర్థికంగా కొంత పురోగతి ఉంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు. కుటుంబంలోని సమస్యలు తీరతాయి. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత విధులు రావచ్చు. వైద్యులు, క్రీడాకారులకు చిరకాల కోరిక నెరవేరుతుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు……. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు నిలిచిపోతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొంత నిదానం పాటిస్తే మేలు. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


బంధువులను ముఖ్యవిషయాలు. నిరుద్యోగులు శుభవార్తలు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉండి అవసరాలు తీరతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తలు సమన్వయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అభివృద్ధిబాటలో నడుస్తారు. ఉద్యోగులకు ఊహించని కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. మహిళలకు కుటుంబసభ్యుల ప్రోత్సాహం. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…ఎరుపు. కాలభైరవాష్టకం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలం. రాబడి మరింతగా పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల వికేంద్రీకరణపై దృష్టి పెడతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. వైద్యులు, చిత్రపరిశ్రమ వారు పట్టుదలతో ముందుకు సాగుతారు.. మహిళలు శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకూల రంగులు……. కాఫీ, గులాబీ. ప్రతికూల రంగు..పసుపు.. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆకస్మిక ప్రయాణాలు సంభవం. కార్యక్రమాలు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూసంబంధిత వివాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తల కృషి కొంత ఫలిస్తుంది. సాంకేతికనిపుణులు, వైద్యులకు విదేశీ పర్యటనల్లో మార్పులు. చిత్ర పరిశ్రమ వారి యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు కొంత ఆందోళన చెందుతారు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు……. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు..నేరేడు.. శివ పంచాక్షరి పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


రుణ బాధలు తప్పవు. కార్యక్రమాలలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో అనవసర విషయాలపై విరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల ప్రగతిపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులు విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలు తొందరపాటు నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడతారు. అనుకూల రంగులు……. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు.. గులాబీ.. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. అందరిలోనూ గుర్తింపు కోసం యత్నిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో మరింత ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. విద్యార్థులు విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతమైన కాలం. అనుకూల రంగులు……. గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నీలం. సత్యనారాయణస్వామిని పూజించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు చక్కదిద్దుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులు అన్నింటా సహకరిస్తారు. వాహనాలు కొంటారు. కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేయడంలో సఫలం చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు మరింత గడిస్తారు. ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన సమాచారం. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఊహించనంత గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు సంతోషదాయకమైన సమయం.. మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు. అనుకూల రంగులు……. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ఆస్తి సంబంధిత వివాదాలు. కొన్ని విషయాలతో మానసిక అశాంతికి లోనవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగవర్గాలకు స్థానచలనం. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు నిదానంగా వ్యవహరిస్తే మంచిది. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు……. తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు… నేరేడు. ఆంజనేయ దండకం పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


స్నేహితులతో కలహాలు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమ తప్ప ఆశించిన ఫలితం ఉండదు. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు తప్పవు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం కావచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కష్టపడ్డా ఫలితం కానరాదు. విద్యార్థులు శ్రమ పడాల్సిన సమయం. మహిళలకు సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు……. లేత గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు… ఆకుపచ్చ. శ్రీbకృష్ణాష్టకం పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చక్కదిద్దుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు కీలకం కావచ్చు. ఉద్యోగాలలో మీ అంచనాలను నిజం చేసుకుంటారు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు అన్ని విధాలా అనుకూలించే సమయం. చిత్రపరిశ్రమ వారు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు……. బంగారు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…కాఫీ. కనకధారా స్తోత్రం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: