Today rashi phahalu – 27 జనవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు పెరిగి కొంత చికాకు పరుస్తాయి. అనారోగ్య సూచనలు. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడులు, సమస్యలు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో నిమగ్నమవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగాలి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. విద్యార్థులు శ్రమకోర్చినా ఫలితం కనిపించదు. మహిళలకు నిరాశా తప్పదు. అనుకూల రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. సూర్యారాధన చేయండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల కీలక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యతిరేకులు కూడా మీ మాటకు ఎదురుచెప్పరు. ఆర్థిక వ్యవహారాలు సంతప్తికరంగా సాగుతాయి. కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణపై అనుమానాలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలించే సమయం. విద్యార్థులకు చెప్పుకోతగిన అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు……. గులాబీ,లేత పసుపు. ప్రతికూల రంగు…కాఫీ. శివనామ స్మరణ మంచిది.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. శుభకార్యాల పై మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కాంట్రాక్టర్ల శ్రమ కొంత ఫలిస్తుంది. బార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు తీరే సమయం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత సానుకూలత. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు. విద్యార్థులు కార్యసాధన దిశగా కదులుతారు. మహిళలకు ఉత్సాహపూరితంగా ఉంటుంది. అనుకూల రంగులు……. నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


బంధువుల నుంచి విమర్శలు. అతి ముఖ్యమైన కార్యక్రమాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండే సూచనలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో కొత్త సవాళ్లు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నిరాశతో గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు వ్యవహారాలలో తొందరపాటు వీడాలి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవేత్తలు, వైద్యులకు వివాదాలు. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…గులాబీ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


అదనపు ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కక పోవచ్చు. కుటుంబ సభ్యులతో విరోధాలు. రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. ధార్మిక వేత్తలను కలుసుకుని వారి నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు చిక్కులు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలు నిర్ణయాలలో తొందరపడరాదు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు…నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


నూతన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మీలో పట్టుదల, సహనం పెరుగుతాయి. సమాజ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.. ఆదాయం విషయంలో ప్రగతి కనిపిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.. పారిశ్రామిక, రాజకీయవేత్తల కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుంది. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు……. నలుపు, బంగారు ప్రతికూల రంగు…నీలం. నృసింహ స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కార్యక్రమాలు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలపై కుటుంబంలో ఏకాభిప్రాయం వెల్లడవుతుంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తదనుగుణంగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరటచెందుతారు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యల నుండి విముక్తి. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా కొనసాగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులు స్వయంకృషితో విజయాల బాట పడతారు. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు……. తెలుపు,కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. ఆంజనేయ దండకం పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఇంటాబయటా చికాకులు. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. శ్రమకు ఫలితం అంతగా ఉండదు. ఆర్థిక పరిస్థితి సాధారణరీతిలో ఉంటుంది. ఆరోగ్యం పై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరుత్సాహం. ఉద్యోగులకు మరింత పనిభారం తప్పదు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు శుభ వార్తలు. విద్యార్థులు అవకాశాలపై సంతృప్తి చెందుతారు. మహిళలకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనుకూల రంగులు……. బంగారు, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…ఎరుపు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కుటుంబ సమస్యలు మరింత వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. తద్వారా శ్రమాధిక్యం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అతి ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు కొంత తగ్గిస్తారు. ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చిక్కులు.. మహిళలకు చికాకులు పరుస్తాయి. అనుకూల రంగులు……. పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


నూతన మిత్రుల పరిచయం. వివాదాల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. ఆదాయం ఆశించిన రీతిలో ఉండి అవసరాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కీలక సమాచారం రాగలదు. విద్యార్థులు చిరకాల కోరిక నెరవేరుతుంది. మహిళలకు సంతోషకరంగా ఉంటుంది. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూలరంగు …ఎరుపు. గణేశాష్టకం పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


శత్రువుల నుంచి మరింత ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు నెలకొనే సూచనలు. కష్టానికి ఫలితం దక్కదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు మీద పడవచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు సమస్యలతో గడుపుతారు. విద్యార్థుల కృషి వృథా కాగలదు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. గణపతిని పూజించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య కలతలు తొలగుతాయి. కాంట్రాక్టర్లు అన్ని విధాలా లాభపడతారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళం నుండి విముక్తి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు అవకాశాలు అనూహ్యంగా దక్కుతాయి. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. మహిళలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. అనుకూల రంగులు……. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణేశాష్టకం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: