Today rashi phalalu – 28 ఫిబ్రవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ఆటంకాలు తప్పకపోవచ్చు. మిత్రులతో మంచి మాట్లాడినా విరోధాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణ స్థాయిలో ఉంటుంది. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆశలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులకు అయోమయ స్థితి. మహిళలు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు…..కాఫీ, గులాబీ. ప్రతికూల రంగు..నేరేడు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆప్తులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. గతంలో ఎన్నడూ చూడని సంతోషం మీలో కలుగుతుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు విశేష లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరింత కలసి వచ్చే కాలం. వ్యవసాయదారుల యత్నాలు సఫలం. విద్యార్థులు ఆశించిన లాభాలు పొందుతారు. మహిళలకు ధన లాభ సూచనలు. అనుకూల రంగులు…. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


రుణ దాతల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు. ఉద్యోగులు విధుల్లో పొరపాట్లు దొర్లి ఇబ్బందిపడతారు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు సమస్యలు తప్పవు విద్యార్థులు ఆచితూచి ముందడుగు వేయాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు.. కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఒక కీలక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ ఆత్మీయతకు బంధువులు ప్రశంసిస్తారు. పాత బాకీలను రాబట్టుకుంటారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి శ్రమ కొంత ఫలిస్తుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఉత్సాహపరుస్తాయి. మహిళలకు ధన లబ్ది. అనుకూల రంగులు….. ఎరుపు, గోధుమ. ప్రతికూలరంగు..పసుపు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు. ఆకస్మిక దన లాభం. కాంట్రాక్టులు కొన్ని లభించే అవకాశం. ఉద్యోగయత్నాలు సానుకూలం. గౌరవమర్యాదలు విశేషంగా లభిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు పడిన శ్రమకు ఫలితం పొందుతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. సాంకేతిక నిపుణులు, వైద్యుల సేవలకు విశేష ప్రాధాన్యత లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న కోర్సులను పొందుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు….. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు..నీలం. శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆర్థిక లావాదేవీలలో గందరగోళం. రుణ యత్నాలు. కార్యక్రమాలలో కొద్దిపాటి అవరోధాలు. దూర ప్రయాణాలు తప్పవు. ఒప్పందాలలో ప్రతిబంధకాలు. పరిస్థితులు వ్యతిరేకంగా మారవచ్చు. స్నేహితులు కూడా వ్యతిరేకత చూపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణలో పొరబడతారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. వైద్యులు, రాజకీయవేత్తలకు కొంత పరీక్షా సమయం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు….. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు.. నేరేడు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనల అమలులో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. బంధుమిత్రులతో తగాదాలు. ఆదాయంలో నిరుత్సాహం చెందుతారు. వ్యాపార,వాణిజ్యవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటులో అప్రమత్తంగా మెలగాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతల భారం. చిత్రపరిశ్రమ వారు, పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకం. విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు….. కాఫీ,తెలుపు. ప్రతికూల రంగు..ఎరుపు. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్తవారు పరిచయమవుతారు. ఆర్థిక వ్యవహారాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కార్యక్రమాలను సాఫీగా పూర్తి చేస్తారు. వేడుకలు, ఉత్సవాలకు హాజరవుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ప్రణాళికాబద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విజయాలు సాధిస్తారు. విద్యార్థులు మరింత తేలిగ్గా అవకాశాలు పొందుతారు. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూల రంగులు….. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు .. ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభవార్తా శ్రవణం. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారవృద్ధి, లాభాలు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు వివాదాల నుండి విముక్తి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు తమ లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. మహిళలకు ధనలాభం. అనుకూల రంగులు….. తెలుపు, గోధుమ. ప్రతికూల రంగు..నీలం. గణపతిని ఆరాధిస్తే మంచిది.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయటా సమస్యలు, చికాకులు. భూవివాదాలతో సతమతమవుతారు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ఉద్యోగావకాశాల పై నిరాశ. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఇబ్బందికర పరిస్థితి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. సాంకేతికనిపుణులు, వైద్యుల పై ఒత్తిడులు రావచ్చు. విద్యార్థుల నిరీక్షణ ఫలించకపోవచ్చు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు….. నీలం,గోధుమ. ప్రతికూలరంగు..గులాబీ. కనకధారా స్తోత్రం పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


స్నేహితులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ మరింతగా పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలను శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని మార్పులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. మహిళలకు చికాకులు. అనుకూల రంగులు….. తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. అంగారక స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఉద్యోగ ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితుల సూచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, నగలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య కార్యక్రమాలు నిర్దేశించిన విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల పై సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఉత్సాహం. విద్యార్థులు ఎంతోకాలంగా ఆశపడుతున్న అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు..నలుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: