Today rashi phahalu – 28 జనవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక విషయాల్లో పురోగతి. ఇంటిలో శుభకార్యాల పై ప్రస్తావిస్తారు. ఆప్తులు సహాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ముందడుగు వేస్తారు. ఉద్యోగులు విధులలో అనుకూల మార్పులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నూతనోత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు……. నలుపు, నీలం. ప్రతికూల రంగు..నేరేడు. గణపతి పూజ మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో కొన్ని విషయాలలో విభేధిస్తారు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు విధులపై కొంత శ్రద్ధ వహించాలి. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు కొంత అనుకూలమైన సమయం. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మహిళలకు మనోవేదన. అనుకూల రంగులు……. తెలుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు.. తెలుపు. విష్ణు ధ్యానం చేయండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
సమాజంలో ప్రత్యేక గౌరవం, ఆదరణ లభిస్తాయి. కార్యక్రమాలలో స్నేహితులు సహకరిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టు అంచనాలు నిజం కాగలవు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులు సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చికాకులు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. అనుకూల రంగులు……. గులాబీ, ఆకుపచ్చ. హనుమాన్ ఛాలీసా పఠించండి
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి ఊహించని విధంగా బయటపడతారు. ఆదాయం పెరిగి సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల పై అనుమానాలు తీరతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు……. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. దత్తాత్రేయుని పూజించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. సోదరులతో విభేదాలు ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిదానిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమవుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త సమస్యలు రావచ్చు. విద్యార్థుల యత్నాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు నిరుత్సాహం తప్పదు. అనుకూల రంగులు……. తెలుపు, కాఫీ. ప్రతికూలం…గులాబీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు.. కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. కాంట్రాక్టులు నిరుత్సాహపరుస్తాయి. మానసిక అశాంతితో గడపాల్సిన సమయం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు ఏమాత్రం అనుకూలించవు. ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు ప్రతి విషయంలోనూ చికాకులు. విద్యార్థులు గందరగోళం మధ్య గడుపుతారు. మహిళలకు నిరుత్సాహం. అనుకూల రంగులు……. బంగారు, గోధుమ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు ధ్యానం మంచిది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
రావలసిన బాకీలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల సమీకరణలో విజయం. ఉద్యోగాల్లో అనుకోని హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అవకాశాలు ఊహించని విధంగా రావచ్చు. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…కాఫీ. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు మీ అంచనాల ప్రకారం పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు మేథస్సును చాటుకుంటారు. మహిళలు శుభకార్యాలకు హాజరవుతారు. అనుకూలం… గులాబీ, ఎరుపు. ప్రతికూలం…నీలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
అవసరాలు పెరిగి రుణాలు చేయాల్సివస్తుంది. ఇంటాబయటా సమస్యలు, వివాదాలు ఎదురుకావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మాటల తొందరపాటుతో ఆప్తులు దూరమవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో నిదానం అవసరం. ఉద్యోగులకు మరింత ఒత్తిడులు రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చిక్కులు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. ఎరుపు, బంగారు. ప్రతికూల రంగు…కాఫీ. దుర్గా స్తోత్రాలు పఠించండి
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో కొంత అవస్థ తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంపై నిర్లక్ష్యం తగదు. ఓర్పు, సహనంతో అడుగులు వేయడం మంచిది. దేవాలయ దర్శనాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఇబ్బందిగా మారే సూచనలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరాశ తప్పదు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివ స్తోత్రాలు పఠించాలి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
నూతన వ్యక్తుల పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కొన్ని ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీల పై కొత్త అంచనాలతో అడుగు వేస్తారు. ఉద్యోగులకు శుభ వార్తలు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు విజయాలు దక్కుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలు కొంత ఊరటనిచ్చే సమాచారం అందుకుంటారు. అనుకూల రంగులు……. నీలం, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. శివ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యయప్రయాసలు ఎదురవుతాయి. బంధువులతో లేనిపోని కలహాలు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు మానసిక ఆందోళన. రాజకీయవేత్తలు, వైద్యులు నిరాశతో గడుపుతారు. విద్యార్థులు శ్రమకోర్చి కొంత ఫలితం దక్కించుకుంటారు. మహిళలు ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. అనుకూల రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com