Today rashi phahalu – 29 జనవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆప్తులతో తగాదాలు. ఆరోగ్యభంగం, ఔషధసేవనం. దూరప్రయాణాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లు. ఉద్యోగులకు నిరుత్సాహమే. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమాధిక్యం. విద్యార్థులు నిరుత్సాహపరుస్తాయి. మహిళలు మనోనిబ్బరంతో ముందడుగు వేయాలి. అనుకూల రంగులు…….గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొత్త ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేక నిలుపుకుంటారు. మీసేవలకు విశేష గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల సలహాలు మేరకు అడుగులు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఇళ్లు, వాహనాలు కొంటారు. ఆదాయం అవసరాల మేరకు సమకూరుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమవారు, క్రీడాకారులకు కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. విద్యార్థులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకూల రంగులు……. కాఫీ, బంగారు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
అనుకున్న పనులు ఒక పద్దతిలో పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ సందడి.. ఆర్థికంగా ఇబ్బందులు తీరే సమయం. సన్నిహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. మీ ప్రతిపాదనల పై బంధువులు ఆమోదం తెలుపుతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు తెలివిగా వ్యవహరించి మరింత దూసుకుపోతారు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయవేత్తలు, వైద్యులకు అన్నింటా విజయాలే. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలు సంతోషదాయకంగా గడుపుతారు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో కలహాలు. ఇంటాబయటా సమస్యలు మరింత పెరుగుతాయి. మానసిక అశాంతి తప్పదు. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడండి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు కొంత తగ్గిస్తారు. ఉద్యోగాలలో ఎదుటవారి బాద్యతలు కూడా మోస్తారు. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు సమస్యలు ఎదురుకావచ్చు. మహిళలు కుటుంబసభ్యులతో విభేదిస్తారు. అనుకూల రంగులు……. పసుపు, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
అనుకోని సంఘటనలు. వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు. ఎంత ప్రతిభావంతులైనా ప్రయోజనం ఉండదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువర్గంతో లేనిపోని తగాదాలు. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు.. వ్యాపార, వాణిజ్యవేత్తలు అధికారుల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు ప్రతి వ్యవహారాన్ని నిదానంగా సాగిస్తారు. విద్యార్థులకు నిరాశ కలిగించే ఒక ప్రకటన రావచ్చు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. గణేశాష్టకం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
బంధువులు సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం మీలో ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యాపారాల ఆలోచనలు కలసివస్తాయి. ఉద్యోగాల్లో ఈతిబాధలు తొలగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఆశలు ఊరిస్తాయి. మహిళలు ఆస్తుల లాభాలు పొందుతారు. అనుకూలం… ఆకుపచ్చ, కాఫీ.ప్రతికూలం…ఎరుపు. శివ పంచాక్షరి పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కుటుంబ సమస్యల నుంచి విముక్తి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు, భూములు కొంటారు. ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో గందరగోళం తొలగుతుంది. వైద్యులు, శాస్త్రవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు. విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది. అనుకూల రంగులు……. బంగారు, గోధుమ. ప్రతికూల రంగు…నేరేడు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పనుల్లో తొందరపాటుతో నిలిచిపోతాయి. భూవివాదాలు తలెత్తే సూచనలు. వాహనాల విషయంలో మెలకువ అవసరం. ఆదాయం తగ్గుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత సమస్యలు. విద్యార్థులకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు……. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. మీ నిర్ణయాలు ఆప్తులను బా«ధిస్తాయి. ప్రయాణాల్లో మార్పులు. వృథా ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం కష్టమే. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఎంత నిదానం పాటిస్తే అంత మంచిది. ఉద్యోగాల్లో లేనిపోని చిక్కులు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొంత నిరాశ తప్పదు. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలు కుటుంబసభ్యులతో విభేదిస్తారు. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. కాలభైరవాష్టకం పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఉపయుక్తమైన సమాచారం రాగలదు. ఆప్తులతో సఖ్యత. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్నింటా లాభాలు. ఉద్యోగులకు విధులు మరింత సులువుగా మారతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు స్వల్ప ధనలబ్ధి. అనుకూల రంగులు……. గులాబీ. ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనల పై ఎటూతేల్చుకోలేరు. ఎంతో కాలంగా చేస్తున్న పని కూడా పెండింగ్లో పెడతారు. దూర ప్రయాణాలలో అలసట, ఖర్చులు. సోదరుల వైఖరి కొంత తలనెప్పిగా మారవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆరోగ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు గందరగోళ పరిస్థితులు. ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు తప్పవు. వైద్యులు, క్రీడాకారులకు అవకాశాలు దూరం కావచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు చికాకులు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, నేరేడు. ప్రతికూల రంగు..ఎరుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు మరింత చేరవవుతారు. కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది. స్థలాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు పుంజుకుంటాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొత్త అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు……. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు… ఆకుపచ్చ. విష్ణు ధ్యానం చేయండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com