Today rashi phahalu – 31 జనవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు. రుణాలు చేయాల్సివలసిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. భార్యాభర్తల మధ్య అకారణ వైరం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశాజనం. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు ఫలించవు. విద్యార్థులకు ఇబ్బందులు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…….ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. గణపతిని పూజించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూల స్థితి. నిరుద్యోగులకు భవిష్యత్ఆశాజనకంగా కనిపిస్తుంది. వేడుకలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు విశేష ఆదరణ. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తిలాభాలు. అనుకూల రంగులు…….గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు.తెలుపు.. కనకధారా స్తోత్రం పఠించాలి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలలోఅవాంతరాలు. సన్నిహితులు, మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేయాల్సిన సమయం. దైవకార్యాలలోపాల్గొంటారు. ఆరోగ్యం కొంత సహకరించదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థుల యత్నాలు విఫలం. మహిళలకు కొంత ఆందోళన చెందుతారు. అనుకూల రంగులు…….పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నీలం.. నరసింహస్వామిని పూజించాలి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
రాబడి మరింత పెరుగుతుంది. సోదరులు, మిత్రులతో సఖ్యత. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. యత్నకార్యసిద్ధి.. ఇళ్లు, వాహనాల కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనూహ్యంగా పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహాయం. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహం.. విద్యార్థుల కృషి, పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఆస్తిలాభాలు. అనుకూల రంగులు……తెలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..గులాబీ.. హనుమాన్ పూజలు చేయండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్త వ్యక్తులు పరిచయం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొన్ని ∙అపవాదులు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు ఆర్జిస్తారు.. ఉద్యోగులకు మంచి గుర్తింపు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు…….గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. మిత్రులే శత్రువులుగా మారతారు. ఆరోగ్య సమస్యలు తప్పవు. భూ సంబంధిత వివాదాలు నెలకొంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరాశాజనకమే. ఉద్యోగవర్గాలకు నిరుత్సాహం.. క్రీడాకారులు, వైద్యులకు చిన్నపాటి సమస్యలు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. అనుకూల రంగులు…….గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు.. తెలుపు. విష్ణు ధ్యానం చేయండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కష్టపడినా ఫలితం అందదు. వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. భార్యాభర్తల మధ్య అకారణ వైరం. దూర ప్రయాణాలు ఉంటాయి.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొంత ఇబ్బంది తప్పదు. ఉద్యోగులకు అదనపు భారం మీద పడవచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…….గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దత్తాత్రేయుని పూజించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. భవనాలు, వాహనాలు కొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ప్రగతిదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి. అనుకూల రంగులు…గోధుమ, పసుపు. ప్రతికూల రంగు..నేరేడు. హనుమాన్కు పూజలు చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి అనుకూల సమాచారం.. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కార్యజయం. అదృష్ట రంగులు…….నీలం, తెలుపు.. ప్రతికూల రంగు…గులాబీ. ఆంజనేయ దండకం పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. పనుల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు. కాంట్రాక్టర్లు ఒత్తిడులకు లోనవుతారు.. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార,, వాణిజ్యవేత్తలు లావాదేవీలు కుదించుకుంటారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలు చేజారి ఇబ్బందిపడతారు. విద్యార్థులకు చికాకులు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వివాదాలు. అదృష్ట రంగులు…….పసుపు, కాఫీ. ప్రతికూల రంగు….నేరేడు.. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
శ్రమ వృధా కాగలదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అకారణ వైరం. శారీరక రుగ్మతలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొంత గందరగోళం. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు పెరుగుతాయి.. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు గందరగోళం. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు మానసిక అశాంతి. అదృష్ట రంగులు…గులాబీ, నీలం. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
పాత బాకీలు వసూలవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అభివృద్ధి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నూతనోత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. అదృష్ట రంగులు…….గులాబీ, కాఫీ.. ప్రతికూల రంగు…నేరేడు. శివాలయంలో అర్చనలు చేయండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com