Today rashi phahalu – 05 జనవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాక ఇబ్బందిపడతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు. బంధువులతో వివాదాలు, విభేదాలు నెలకొంటాయి. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేయక తప్పదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని చిక్కులు. ఉద్యోగాల్లో విధులు సమస్యగా మారవచ్చు. వైద్యులు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… నీలం, నలుపు. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొత్త పరిచయాలతో ఉత్సాహంగా గడుపుతారు. అదనపు రాబడి దక్కుతుంది. సన్నిహితులతో విభేదాలు. కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులపై కొంత భారం తగ్గవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులు విద్యాకోర్సులు దక్కించుకుంటారు. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
రుణ బాధలతో అవస్థలు పడతారు. బంధువులతో లేనిపోని తగాదాలు. దూర ప్రయాణాలు సంభవం. కార్యక్రమాలను చేసేదిలేక వాయిదా వేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే సూచనలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థులకు కొంత అసంతృప్తి. మహిళలకు నిరాశాజనకమైన కాలం. అనుకూల రంగులు…… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. శ్రీ రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అతి ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. శుభకార్యాలు, విందువినోదాలకు హాజరవుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీదే పైచేయిగా నిలిచి పట్టు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునే సమయం. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…… పసుపు, లేత గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. సత్యనారాయణస్వామిని పూజించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కుటుంబంలో సమస్యలు, వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు కలసివస్తాయి. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బంధువులతో తగాదాలు తీరతాయి. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సేవామార్గంలో పయనిస్తారు. స్థిరాస్తి లాభ సూచనలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సమస్యలను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…… ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. హనుమాన్ ఛాలీసా పఠించండి
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కుటుంబ సమస్యలతో అవస్థలు పడతారు. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. సన్నిహితులతో అకారణ వైరం. ఆరోగ్య పరిస్థితి చికాకు పరుస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ఎట్టకేలకు ఊరట లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు అయోమయస్థితి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. సూర్యారాధన మంచిది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
రాబడి తగ్గి నిరాశ చెందుతారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. స్నేహితుల నుంచి కీలక సమాచారం. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. దేవాలయాల సందర్శనం. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని చిక్కులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు ఆశ్చర్యకర సంఘటనలు. విద్యార్థులు నిరాశకు లోనవుతారు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు…… గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
నూతన ఉద్యోగాలలో చేరతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త ఆశలతో కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితిని మరింత చక్కదిద్దుకుంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులు సహచరుల సాయంతో విధులు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ప్రగతిదాయకంగా ఉంటుంది. విద్యార్థులు అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ అన్నపూర్ణాష్టకం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ఇబ్బందులు కొంతమేర అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి విషయాల్లో చిక్కులు, చికాకులు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగులు వివాదాల నుండి బయటపడతారు. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులు విదేశీ పర్యటనలు జరుపుతారు. మహిళలకు ఆహ్వానాలు అందుతాయి. అనుకూల రంగులు…… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఎరుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుంచి మాటపడతారు. ఆదాయం తగ్గినా అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు పోటీదారులతో ఇబ్బందులు. విద్యార్థులు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… నీలం, కాఫీ. ప్రతికూల రంగు..పసుపు. శ్రీ దుర్గా స్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో తగాదాలు నెలకొంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. స్నేహితులు, బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి తగ్గి అవసరాలకు ఇబ్బందిపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలించదు. విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు. మహిళలకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. అనుకూల రంగులు….. నలుపు, లేత గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
శుభకార్యాలలో మీ పాత్ర పోషిస్తారు. కార్యక్రమాలలో ఎట్టకేలకు విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం కలుగుతుంది. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. రాబడి మరింత పెరుగుతుంది. కాంట్రాక్టులు కొన్ని స్వయంగా సాధిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత సంతోషదాయకం. ఉద్యోగులకు విధులు తేలికపడతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విశేష యోగదాయకం. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు…… గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ కనకదుర్గాదేవిని పూజించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com