Today rashi phahalu – 06 జనవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు ప్రశంసలు, అభినందనలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అన్ని విధాలా కలసి వస్తుంది. విద్యార్థులకు శుభవర్తమానాలు. మహిళలకు అంచనాలు ఫలిస్తాయి. అనుకూల రంగులు…… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. వినాయకుని అర్చనలు చేయండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు మీతో విభేదిస్తారు. వారికి నచ్చచెప్పే యత్నాలు ఫలించవు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆరోగ్య విషయాలలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మానసిక ఆందోళన. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…నేరేడు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


విలువైన వస్తువులు సేకరిస్తారు. అందరికీ ఆప్తులై ప్రశంసలు పొందుతారు. కొత్త కార్యక్రమాలు వేగవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు చాలవరకూ తగ్గుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సత్కారాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు మానసిక అశాంతి తీరుతుంది. అనుకూల రంగులు… నీలం, గోధుమ. ప్రతికూల రంగు…కాఫీ. ఆంజనేయ దండకం పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలతో అలసట తప్పదు. బంధువులు, శ్రేయోభిలాషులు మీపట్ల వ్యతిరేకత చూపుతారు. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు పరీక్షా సమయం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు గందరగోళం. ఉద్యోగులకు విధులు ఇబ్బందికరంగా మారతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు చికాకులు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. మహిళలకు కొన్ని చిక్కులు. అనుకూల రంగులు… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. ఆదిత్య హృదయం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


పరిచయాలు మరింత పెరుగుతాయి. మిత్రుల చేయూత లభిస్తుంది. కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు రావచ్చు. వాహనాలు , ఆభరణాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు అనుకోని సంఘటనలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీయానం జరుపుతారు. విద్యార్థులకు అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు ఆహ్వానాలు. అనుకూల రంగులు… పసుపు, గులాబీ. ప్రతికూలం…నేరేడు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆప్తులు మరింత చేరువ కాగలరు. తీర్థ యాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విజయాలు చేకూరతాయి. విద్యార్థులకు కొంత అనుకూలం. మహిళలకు చిత్రమైన సంఘటనలు. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


రుణ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు. కార్యక్రమాలు ఆటంకాలతో నడుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలతో సతమతమవుతారు. కాంట్రాక్టుల యత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. మహిళలు మానసిక ఆందోళన చెందుతారు. అనుకూల రంగులు…… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వ్యవహారాల్లో ఎటూతేలనిస్థితి. కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు అందక ఇబ్బందులు పడతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మరింత పనిభారం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు. అనుకూల రంగులు… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


స్నేహితుల నుంచి ఆహ్వానాలు.. కార్యక్రమాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఆదాయం మీ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. భూవివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. నిర్ణయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు చికాకులు లేకుండా విధులు సాగిపోతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు అంచనాలు తప్పుతాయి. అనుకూల రంగులు… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. దుర్గా స్తోత్రాలు పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగలాభం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహం, వాహనాలు కొంటారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను వికేంద్రీకరిస్తారు. ఉద్యోగులకు సంతోషదాయకమైన సమయం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకూల రంగులు… కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నృసింహ స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కుటుంబ సమస్యలతో అవస్థపడతారు. అనుకున్నది సాధించాలన్న యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. ఆరోగ్యం సహకరించక కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఇబ్బందులు. ఉద్యోగులకు విధులలో అవాంతరాలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలించకపోవచ్చు. విద్యార్థులకు ఆశలు నిరాశ పరుస్తాయి. మహిళలకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. అనుకూల రంగులు… గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


దూర ప్రయాణాలు చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన. కష్టించినా ఫలితం అంతగా ఉండదు. కాంట్రాక్టులు చేజారవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులకు కొంత నిరాశ. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు …ఎరుపు. గణేశాష్టకం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: