ఈ రోజు రాశి ఫలాలు – Today Rasi Phalalu based on moon sign
Check Today Horoscope in Telugu based on moon sign by famous astrologer Vakkantham Chandramouli gaaru. ఈ రోజు రాశి ఫలాలు జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం తెలుసుకోండి.
20 మే 2025 - మంగళవారం
జన్మ నక్షత్రం ప్రకారం
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. మీ ప్రతిభకు పదునుపెట్టి పేరుగడిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు హోదాలు నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. కళాకారులు మరింత పేరుగడిస్తారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. మహిళలు శుభకార్యాలు నిర్వహిస్తారు. అనుకూల రంగులు.... కాఫీ, బంగారు. ప్రతికూల రంగు...ఎరుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వృషభం
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) శత్రువులను ఆకట్టుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయం. ఇంటబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల యత్నాలు సఫలం. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు పరిస్థితులు అనుకూలం. కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు అందుకుంటారు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు..... గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు...నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి
మిథునం
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అవకాశాలు చేజారతాయి. ఉద్యోగస్తులు కష్టించినా విధుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు సమస్యలు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఆందోళన తప్పదు. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు. మహిళలు నిర్ణయాల పట్ల తొందరపడవద్దు. అనుకూల రంగులు...నీలం, నేరేడు. ప్రతికూల రంగు...ఎరుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి సతమతమవుతారు. శ్రమకు ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పట్టుదలతో అడుగులు వేయాలి. ఉద్యోగులకు విధుల్లో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు, వైద్యులకు నిరుత్సాహం తప్పదు. కళాకారులు అయోమయ పరిస్థితి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి.. మహిళలు కుటుబంలో చికాకులు ఎదుర్కొంటారు. అనుకూల రంగులు...... ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు... గులాబీ. కనకధారా స్తోత్రం పఠించండి.
సింహం
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలకు తగు గుర్తింపు పొందుతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సంభాషణలు. పలుకుబడి కలిగిన వారు తోడుగా నిలుస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మరింత లాభపడతారు. ఉద్యోగ విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. సాంకేతిక నిపుణులు, కళాకారులకు కొత్త ఆశలు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. మహిళలకు భూ లాభాలు. అనుకూల రంగులు... నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు.. తెలుపు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
కన్య
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) కుటుంబసభ్యులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో భావాలు పంచుకుంటారు. వ్యూహాలు అమలు చేసి విజయపథంలో సాగుతారు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా నడుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి కలుగుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు. సాంకేతిక నిపుణులు, కళాకారుల యత్నాలలో పురోగతి. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు... ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు..నీలం. గణపతిని ఆరాధించండి.
తుల
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు) ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు ఉండవచ్చు. కుటుంబసభ్యులతో విభేదాలు. దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు వాయిదా. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అశాంతి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. అనుకూల రంగులు.. కాఫీ, బంగారు. ప్రతికూల రంగు...చాక్లెట్. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
వృశ్చికం
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్య కార్యక్రమాలను పెండింగ్ లో పెడతారు. బంధు గణంతో అకారణంగా తగాదాలు. మానసిక అశాంతి. కుటుంబసమస్యలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. శారీరక రుగ్మతలు. ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తత అవసరం. ఆస్తులు విషయంలో మరింత నిదానం పాటించండి. వ్యాపారాలు సాధారణస్థాయిలో ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. కళాకారులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. పరిశోధకులు, వ్యవసాయదారులు కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. అనుకూల రంగులు... తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు..నీలం. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) నిరుద్యోగులకు శుభ వర్తమానాలు. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాల హడావిడి. అదనపు ఆదాయం ఊరట కలిగిస్తుంది. సన్నిహితులు చేయూతనందిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారులకు ఉత్సాహవంతమైన కాలం. ఉద్యోగులు అనుకున్నంత లాభాలు గడిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయానం. సాంకేతిక నిపుణులు, కళాకారులు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు.... గోధుమ, బంగారు. ప్రతికూల రంగు...ఎరుపు. గణపతిని పూజించండి.
మకరం
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు) ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. శ్రమ పెరుగుతుంది. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి సమస్యలు. కళాకారులకు కొంత అశాంతి. విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు...ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు...నేరేడు. గణేశ్ ప్రార్ధనలు చేయండి.
కుంభం
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుంచి కీలక సలహాలు. నూతన వ్యక్తులు పరిచయం. ఉద్యోగ యత్నాలలో విజయం. ప్రత్యర్థుల పై మరింత పట్టు సాధిస్తారు. రాబడి అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల అంచనాలు ఫలిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తల అంచనాలు నెరవేరతాయి. సాంకేతిక నిపుణులు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు భూలాభాలు కలుగుతాయి. అనుకూల రంగులు..... పసుపు, గోధుమ. ప్రతికూల అనుకూల రంగులు...నలుపు. హనుమాన్ నామాలు స్మరించండి.
మీనం
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో మాటపడతారు. కొన్ని కార్యాలు మధ్యలో ఆపివేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు చేజారతాయి. ఆదాయం సమకూరినా ఉత్సాహం ఉండదు. ఏదో అవసరం వస్తునే ఉంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు నిరాశ చెందుతారు. ఉద్యోగస్తులు విధుల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి. సాంకేతిక నిపుణులు, వ్యవసాయదారులకు సామాన్యస్థితి. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు మనస్సు స్థిరంగా ఉండదు. అనుకూల రంగులు... నీలం,ఆకుపచ్చ. ప్రతికూల రంగు...ఎరుపు. సూర్యారాధన మంచిది.
ఈ రోజు రాశి ఫలాలు జన్మ తేది/సూర్య రాశి ప్రకారం – Today rasi phalalu in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Today Horoscope in Telugu by Vakkantham Chandramouli’s Janmakundali.com
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope (today horoscope in telugu), festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.