Sri Bhagavatam – Weapon of Lord Vishnu Sudarshana born as Kartaviryarjuna
ఒక రోజున జమదగ్ని మహర్షి పూజ పూర్తి చేసుకుని, ఆశ్రమములోనే ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడు. అందరికి ఆహారాన్ని ఏర్పాటు చేయడంలో రేణుకాదేవి నిమగ్నమై ఉంటుంది. పరశురాముడు .. అతని సోదరులంతా రోజూ మాదిరిగానే అడవికి వెళతారు. అదే సమయంలో కార్తవీర్యార్జునుడు తన పరివారంతో కలిసి అడవికి వేటకు వస్తాడు. వేటాడి అలసిపోయిన ఆయనకి బాగా ఆకలి వేస్తుంది. ఆకలి తీర్చుకునే మార్గం ఏదైనా ఉందేమోనని ఆయన వెదుకులాట మొదలుపెడతాడు. ఆ సమయంలోనే ఆయనకి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది.
కార్తవీర్యార్జునుడు(Kartaviryarjuna) హైహయ వంశానికి చెందిన రాజు .. ఆయన మాహిష్మతి నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. శ్రీమహావిష్ణువు ఆయుధమైన సుదర్శనుడే(Sudarshana) కార్తవీర్యార్జునుడిగా జన్మిస్తాడు. విష్ణుమూర్తి(Lord Vishnu) లోక కల్యాణం కోసం చక్రాయుధంతో ఎంతోమంది అసురులను సంహరిస్తాడు. దాంతో తాను లేకపోతే విష్ణుమూర్తి ఏమీ చేయలేడనే ఒక అహంభావం సుదర్శనుడికి వస్తుంది. అది గ్రహించిన విష్ణుమూర్తి .. లోకులు కూడ అలాగే అనుకునే అవకాశం ఉందని అంటాడు. అంతేకాదు సుదర్శనుడు లేకుండా తన శక్తి ఎంతటిదో తనకి కూడా తెలియవలసిన అవసరం ఉందని చెబుతాడు.
భూలోకాన కార్తవీర్యార్జునుడిగా జన్మించమని సుదర్శనుడితో విష్ణుమూర్తి చెబుతాడు. తాను పరశురాముడిగా అవతరిస్తానని అంటాడు. ఒకానొక విషయంలో తామిద్దరం తలపడతామనీ, అప్పుడు ఎవరి శక్తి ఏమిటనేది తేలిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకు అంగీకరించిన కార్తవీర్యార్జునుడు భూలోకాన ఒక రాజకుటుంబాల్లో జన్మిస్తాడు. అయితే ఏ మాత్రం సత్తువలేని సొట్ట చేతులతో ఆయన పుడతాడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి కార్తవీర్యార్జునుడు తన పరిస్థితిని తలచుకుని బాధపడుతూ ఉంటాడు.
వారసత్వంతో తాను సింహాసనాన్ని అధిష్ఠించవలసివాడు. రాజు అనేవాడు బాహుబల సంపన్నుడై .. శౌర్య పరాక్రమాలకు ప్రతిరూపంగా ఉండాలి. సొట్ట చేతులతో తాను నిస్సహాయుడిగా ఉండిపోవాల్సి వచ్చింది. తాను రాజును కావాలి .. అందుకు అవసరమైన బాహుబలాన్ని సంపాదించుకోవాలని కార్తవీర్యార్జునుడు నిర్ణయించుకుంటాడు. అనుకున్నది సాధించడం కోసం తన ఆరాధ్యదైవమైన దత్తాత్రేయస్వామిని పూజించడం మొదలుపెడతాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో “దత్త వ్రతం” చేస్తుంటాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Weapon of Lord Vishnu Sudarshana born as Kartaviryarjuna