Why do we celebrate Maha Shivaratri.
మహాశివరాత్రి జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో వున్నవి. ఉదాహరణకు శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజని లేక శివుడు హాలాహలాన్ని త్రాగిన రోజని చెబుతుంటారు. కానీ పురాణాల ప్రకారం చెప్పుకునే కథ గురుంచి తెలుసుకుందాం.
భూమి మీద సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విశ్వం లోని సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు. బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలో ఉంటారు. ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. అలా వారిద్దరూ వాదించుకునే క్రమంలో వారి ఇద్దరి మధ్యలో వున్న చీకటిలో ఒక జ్యోతి రూపంలో లింగం ఆవిర్భవించింది.
ఆ లింగం ఎంత పెద్దదిగా ఉంది అంటే దానియొక్క ముందు భాగం మరియు వెనుక భాగం ఎక్కడ ఉన్నాయో తెలియని హాద్దులు లేని అగ్ని రూపం లో వున్న లింగం వారికి కనబడుతుంది. ఆ లింగంలో నుండి కొన్ని మాటలు వినబడుతాయి. ఎవరైతే ఈ లింగం యొక్క ముందు లేదా వెనుక భాగం త్వరగా కనుక్కొని వచ్చిచేప్తే వారే గొప్ప అని ఆ లింగం తెలియజేస్తుంది. ఆ లింగం చాలా ఎత్తుగా దాదాపు ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాల్ని దాటివేసేంతగా వుంది.
అప్పుడు వారు ఇద్దరిలో ఒకరు పైన ఏడు లోకాలని మరి ఒకరు క్రింద ఏడు లోకాలని వెతకాలని నిర్ణయించుకుంటారు. వెంటనే విష్ణు మూర్తి తన దశావతారాల్లో ఒకటైన వరాహ అవతారంతో క్రింద ఉన్న పాతాళ లోకం తొవ్వుకుంటూ వెళ్లారు. ఇక బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా విష్ణుమూర్తికి ముందు భాగం కనపడకపోయే సరికి తిరిగి వచ్చేస్తారు ఇంతలో బ్రహ్మ మాత్రం తాను చూసానని అబద్ధం చెప్తారు.
మండుతున్న ఆ జ్వాలా లింగం నుండి బ్రహ్మ అబద్ధం చెప్పారు కాబట్టి తనకు ఎవరూ పూజలు చేయరని ఆగ్రహంతో మాటలు వినబడుతాయి. ఆ మాటలు విన్నాక ఆ లింగం ఎవరో కాదు మహాశివుడు అని వారికి అర్ధం అవుతుంది. బ్రహ్మ తన తప్పు ఒప్పుకుంటారు. ఆ లింగం నుండి శివుడు బయటకి వచ్చి ఈ విశ్వంలో ఒకరు గొప్ప అని ఏమిలేదు. సృష్టి, స్థితి, లయ మూడు కూడా సమానమే అని చెబుతారు.
అలా మాఘ మాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో వున్న జ్యోతి లాగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. ఇక శివరాత్రి అని ఎందుకంటాం అంటే ఆ రోజున లింగం మహానిషి అనే సమయంలో ఆవిర్భవిస్తుంది. నిశి అంటే సంస్కృతంలో రాత్రి అని అర్ధం. చీకటి లో ఒక జ్యోతి లాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాం.
ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రం మన దేశంలో చాలా మంది జాగారం చేస్తారు. జాగారం చేయలేని వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఎందుకంటే జీవితంలో ఒకసారైనా జాగారం లేదా ఉపవాసం చేయడం వలన మనకు సహనం, దృష్టి పెరుగుతాయని పెద్దవాళ్ళ నమ్మకం. అందుకే వాళ్ళు “జన్మకో శివరాత్రి” అంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Why do we celebrate Maha Shivaratri.