Telugu Yearly Horoscope 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా 12 రాశుల వారికి రాబోయే పన్నెండు నెలల్లో జన్మ తేది/సూర్య రాశి ప్రకారం ఈ సంవత్సర రాశి ఫలాలు (Yearly Horoscope in Telugu) ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. 2026 rasi phalalu in Telugu for all 12 zodiac signs. 2026 telugu calendar rasi phalalu.
మేషం (21 మార్చ్ – 19 ఏప్రిల్)
కొన్ని అద్భుత ఫలితాలు ఈ సంవత్సరం చూస్తారు. మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఎవరికీ తలవంచక సొంత ఆలోచనలతోనే ముందుకు సాగుతారు. తరచూ ప్రయాణాలు, తీర్థయాత్రలతో గడుపుతారు. ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ నిద్రపోరు. ప్రధాన నిర్ణయాలపై తొందరపాటు వద్దు. మిత్రులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. సమస్యల పరిష్కారంపై కొన్ని మీరు చేసే ప్రతిపాదనలకు అందరూ ఆమోదం తెలుపుతారు. భార్యాభర్తల మధ్య ఎంతోకాలంగా నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. కొన్ని కేసుల నుండి గట్టెక్కే కాలం. ఆర్థికంగా బలం చేకూరినా కొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. వ్యాపారాలలో లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. విస్తరణలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు, విధి నిర్వహణలో ఎవరికీ తలవంచరు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రాజకీయవేత్తలకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని విదేశీ పర్యటనలు మాత్రం రద్దు చేసుకుంటారు. వ్యవసాయదారులకు అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. ఐటీ రంగం వారి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. మహిళలకు ఎన్నడూ లేని విధంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మార్చి,మే, జూలై, అక్టోబర్, నవంబర్‌నెలలు చికాకులు, బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. తరచూ అనారోగ్యం. ముఖ్యంగా నవంబర్‌లో మరింత జాగ్రత్తలు పాటించాలి.
అదృష్టసంఖ్య–9, ఎరుపు, నేరేడు, బంగారు రంగులు కలిసివస్తాయి.
వృషభం ( 20 ఏప్రిల్- 20 మే)
ఎవరితోనైనా సరే మితంగా మాట్లాడుతూ ముందుకు సాగడం ఉత్తమం. మీ సత్తా నిరూపించుకునేందుకు అవకాశాలు వస్తాయి. బంధువులు, మిత్రులు మీ సహనాన్ని పరీక్షించేందుకు యత్నిస్తారు. అయితే చివరికి మీ మాటే చెల్లుతుంది. ముఖ్య వ్యవహారాలను ఆటంకాలు అధిగమించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరి హృదయాలు గెలుచుకుని కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకుంటారు. అవివాహితులైన వారికి వివాహయోగం. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి లబ్ధి పొందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబంలో మీపట్ల మరింత సానుకూల వైఖరి నెలకొంటుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా తిరిగి స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలు క్రమేపీ లాభాల దిశగా కొనసాగుతాయి. మీ లావాదేవీల్లో ఇతరుల జోక్యం వద్దు. ఉద్యోగాలలో అనుకున్న బా«ధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తారు. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు. అయితే కొంత శ్రమ కూడా తప్పదు. వ్యవసాయదారులు ఆచితూచి ముందుకు సాగాలి. ఐటీ రంగం వారికి శుభసమయం వచ్చింది. మహిళలు అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని చాటుకుంటారు. ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, నెలలు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. నమ్ముకున్న వారే మీకు నష్టం కలిగించవచ్చు. మానసికంగా సంఘర్షణ ఎదుర్కొంటారు.
అదృష్టసంఖ్య–6. వీరు నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు విజయానికి సూచికగా ఉంటాయి.
మిథునం (21 మే – 20 జూన్)
చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడంలో కొందరి సహాయం స్వీకరిస్తారు. కొన్ని సందర్భాలలో రాజయోగం అనుభవిస్తారు. విలాసజీవితం గడుపుతారు. చిత్రమైన రీతిలో దూరమైన వ్యక్తులు దగ్గరవుతారు. మీ సహనానికి పరీక్షించేందుకు స్నేహితులు యత్నించి విఫలమవుతారు. దృఢ చిత్తంతో ముందుకు సాగి విజయాలు సాదిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బంధువులతో తరచూ విభేదాలు నెలకొన్నా సర్ది చెబుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. అయితే చివరి భాగంలో విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ఆస్తుల విషయంలో చేసుకున్న అగ్రిమెంట్లు చేసుకుని అడ్వాన్సులు చెల్లిస్తారు.
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. రుణదాతల ఒత్తిడులు చాలావరకూ తొలగుతాయి. తీర్థయాత్రలు విశేషంగా చేస్తారు. సంఘం సేవలో భాగస్వాములవుతారు. వ్యాపారస్తులు స్వీయ అనుభవాలతో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపార సంస్థల ప్రారంభానికి సంసిద్ధులవుతారు. ఉద్యోగస్తులు శ్రమ పెరిగినా తట్టుకుని తగిన గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధించడంలో విజయం పొందుతారు. వ్యవసాయదారులకు సామాన్యంగానే ఉంటుంది. ఐటీ రంగం వారు పట్టుదలతో అప్పగించిన పనులు పూర్తి చేస్తారు. మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మే, జులై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక విషయాలు ఇబ్బందులు రావచ్చు. కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.
అదృష్టసంఖ్య–5, ఆకుపచ్చ, కాఫీ రంగులు అనుకూలిస్తాయి.
కర్కాటకం (21 జూన్ – 22 జులై)
సామాజిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించి ఆదిశగా అడుగులు వేస్తారు. మీ హితబోధలు కొందరిపై ప్రభావం చూపవచ్చు. మీరు నమ్మిన వ్యక్తులు మరింత చేయూతనిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధం చేస్తారు. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. ఇంటి నిర్మాణాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు. ద్వితీయార్థంలో ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎంతో నేర్పుగా ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి, అయితే అవసరాల రీత్యా కొన్ని అప్పులు కూడా చేస్తారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో కొంత మేరకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు సమకూర్చుకునేందుకు చేసే యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులు రెండవపంట అనుకూలించి ఉపశమనం పొందుతారు. ఐటీ రంగం వారికి చెప్పుకోతగిన అభివృద్ధి ఉంటుంది. మహిళలకు ఎంతోకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి. జనవరి, ఫిబ్రవరి, జూన్, ఆగస్టు, అక్టోబర్నెలల్లో మరింత అప్రమత్తత అవసరం. ప్రతి వ్యవహారంలోనూ, ఆరోగ్యపరంగా చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. లేదా ప్రమాదాలు.
అదృష్టసంఖ్య–2, పసుపు, బిస్కట్రంగులు అనుకూలం.
సింహం (23 జులై – 22ను ఆగష్టు)
ఈతిబాధల నుంచి ఏదోలా గట్టెక్కుతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు చాలావరకూ పరిష్కారమవుతాయి. ఆప్తులు, బంధువులు మీ పట్ల ఆదరణ, ప్రేమ కనబరుస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలోనే పూర్తి చేసి ముందుకు సాగుతారు. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి. భవిష్యత్‌పై విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో పెనుమార్పులు ఉండవచ్చు. ఊహించని రీతిలో ధనలబ్ధి. పొదుపు బాటలో పయనిస్తారు. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరడంతో పాటు భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా సాగుతారు. మీపైస్థాయి అధికారులు మిమ్మల్ని ప్రశంశలతో ముంచెత్తుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు విశేష గుర్తింపు పొందుతారు. కొందరికి పదవులు దక్కవచ్చు. వ్యవసాయదారుల కలలు నెరవేరే అవకాశాలున్నాయి. ఐటీ రంగం వారు సొంత ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేస్తారు. మహిళలకు పుట్టింటి వారి నుంచి లబ్ధి చేకూరే అవకాశం. ఫిబ్రవరి, మార్చి,సెస్టెంబర్, నవంబర్, పతిబంధకాలు, ముఖ్యంగా మార్చి నెల కొంత జాగ్రత్తలు అవసరం. వివాదాలు, మానసిక అశాంతి. అత్యంత ఆప్తులతోనే విరోధాలు. ఖర్చులు విశేషంగా ఉంటాయి.
అదృష్టసంఖ్య–1.గులాబీ, చాక్లెట్‌రంగులు అనుకూలం.
కన్య (23 ఆగష్టు – 22 అక్టోబర్)
అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు వచ్చినా పట్టువీడని విక్రమార్కుడిగా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రముఖులు పరిచయమై సహాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకునేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి వివాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి. ద్వితీయార్థమంతా శుభకార్యాల నిర్వహణ, హడావిడితో గడుపుతారు. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని కేసుల నుండి బయటపడేందుకు అవకాశాలున్నాయి. కాంట్రాక్టుల విషయంలో అనుకున్నది సాధిస్తారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారాలు ప్రథమార్థంలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి లాభాల బాటపడతారు. ఉద్యోగాలలో జరిగే మార్పులు మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఉన్నతాధికారులు కూడా మీ పనితనాన్ని మెచ్చుకుని అభినందనలు చెప్పడం విశేషం. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు తమ ప్రతిభ చాటుకుంటారు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఐటీ రంగం వారు కొత్త నైపుణ్యాలు చూపుతారు. మహిళలకు స్థిరాస్తి లాభాలు ఉండవచ్చు. మార్చి, ఏప్రిల్, ఆగస్టు,అక్టోబర్, డిసెంబర్, అన్ని విషయాలలోనూ అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబంపై దృష్టి పెట్టాలి.
అదృష్టసంఖ్య–5, పసుపు, బంగారు రంగులు అనుకూలం.
తుల (23 సెప్టెంబర్ – 22 అక్టోబర్)
ఇంతకాలం ఎదురుచూసిన నిరుద్యోగులకు విజయం చేకూరి ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఇంటిలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు, ఒత్తిడులు తొలగుతాయి. కొన్ని సమస్యలు తీరి మరింత ఊరట కలుగుతుంది. ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. విచిత్రసంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని సమయాలలో అప్రయత్నంగా కార్యజయం, ధనలాభాలు కలుగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అయితే ద్వితీయార్థంలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు, అప్రమత్తత అవసరం. ఉద్యోగాలలో ఊహించని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. విధి నిర్వహణలో సహచరుల సహకారం అందుతుంది. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు మరింత రాణింపు ఉంటుంది. అలాగే, సరైన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది. జనవరి, మార్చి, ఏప్రిల్, మే, నవంబర్, నెలలు ప్రతికూలం. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు, బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు.
అదృష్టసంఖ్య–6, నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలం.
వృశ్చికం (23 అక్టోబర్ – 22 నవంబర్)
పట్టుదల వీడకుండా ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. ఒక వ్యక్తి ఊహించని రీతిలో సహాయం అందించేందుకు ముందుకు వస్తారు. ముఖ్య వ్యవహారాలు అనుకున్న తడవుగా పూర్తి చేస్తారు. ప్రముఖుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నిరుద్యోగులు తమ కృషికి తగిన ఫలితం పొందుతారు. అయితే ద్వితీయార్థంలో శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. జీవిత భాగస్వామితో తరచూ వివాదాలు ఇబ్బందిగా మారినా ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లు గతం కంటే మరింత రాణిస్తారు. లాభాల బాట పడతారు. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పర్చినా ఎప్పటికప్పుడు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి. భాగస్వాములు మీ పనితీరుని గుర్తిస్తారు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు, అలాగే, మీ పనితీరుపై ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట సానుకూలమవుతుంది. ఫిబ్రవరి, మే, జూన్, అక్టోబర్, డిసెంబర్, నెలల్లో ఈతిబాధలు, శ్రమాధఇక్యం. శారీరక రుగ్మతలు. కొన్ని ఆస్తు ల తగాదాలు. ఖర్చులు అధికం.
అదృష్టసంఖ్య–9, ఎరుపు, గులాబీ, నేరేడు రంగులు అనుకూలం.
ధనుస్సు (23 నవంబర్ – 22 డిసెంబర్)
ప్రతి వ్యవహారంలోనూ ప్రథమార్థంలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. బంధువులు, మిత్రులతో కొన్ని వివాదాలు వచ్చి నిరుత్సాహం చెందుతారు. మీరు సాయం అందించినవారే సమయానికి దూరంగా ఉంటారు. తరచూ తీర్థయాత్రలు సాగిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలపై మరింత ఆలోచన అవసరం. సోదరులు, సోదరీల నుంచి ఆశించిన సాయం స్వీకరిస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ద్వితీయార్థం శుభదాయకంగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాల నిమిత్తం సొమ్ము ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపారస్తులు కష్టపడ్డా లాభాల బాటలో పయనిస్తారు. పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పైస్థాయి అధికారుల మెప్పు కోసం ఎంతో యత్నిస్తారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. ఐటీ రంగం వారు నిరాశ నుండి బయటపతారు. ఊహించని అవకాశం లభించవచ్చు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. జనవరి, మార్చి, జూన్, జూలై, నవంబర్ నెలలు ప్రతికూలం. ఆరోగ్యం, కుటుంబవిషయాలలో ఇబ్బందులు నెలకొనవచ్చు. అలాగే, వృత్తులు, వ్యాపారాలలో ఆందోళన. ఒత్తిడుఉల ఎక్కువ కాగలవు.
అదృష్టసంఖ్య–3, నేరేడు, తెలుపు రంగులు అనుకూలం.
మకరం (23 డిసెంబర్ – 22 జనవరి)
కొన్ని లక్ష్యాల సాధనలో అవాంతరాలు అధిగమిస్తారు. బంధువులు, మిత్రుల సూచనలు మేరకు అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చాకచక్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకుని అడ్వాన్సులు చెల్లిస్తారు. సోదరులు,సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రథమార్థంలో సంతానరీత్యా చికాకులు నెలకొనవచ్చు. ఆర్థిక పరిస్థితి మొత్తానికి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వ్యాపారస్తులు అనుకున్నలాభాల కోసం చేసే యత్నాలు సఫలం. పెట్టుబడులకు ఇబ్బందులు తీరతాయి. భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తారు. క్రీడాకారులు,రాజకీయవేత్తలు, కళాకారులు అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఐటీ రంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. మహిళలకు మరిన్ని విజయాలు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు నెలలు ప్రతికూలం. అనుకోని సంఘటనలు, ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. కొన్ని వేడుకలు, కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వృథాగా ఖర్చులు చేస్తారు.
అదృష్టసంఖ్య–8, ఆకుపచ్చ, నీలం, అనుకూలం.
కుంభం (23 జనవరి – 22 ఫిబ్రవరి)
పట్టుదల, ధైర్యమే మీ విజయాలకు బాటలు వేస్తుంది. అనుకున్న వ్యవహారాలు ప్రథమార్థంలో వేగంగా పూర్తి చేస్తారు. ఎవరు ఏమి చెప్పినా సొంత ఆలోచనలే పాటిస్తారు. వాహనాలు, విలువైన ఆభరణాలు కొంటారు. ప్రముఖులు పరిచయమై మీకు సహాయకారులుగా నిలుస్తారు. బంధువులు మీపై మరింత ప్రేమ చూపుతారు. వివాహాది వేడుకల నిర్వహణతో ద్వితీయార్థం గడుస్తుంది. సంతానపరంగా ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. భవిష్యత్‌పై నిరుద్యోగులకు మరింత భరోసా కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త భాగస్వాములతో ఉత్సాహంగా సాగుతాయి. అ నూహ్యమైన రీతిలో లాభాలు గడిస్తారు. విస్తరణలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు రాగలవు. సహచర ఉద్యోగులు సైతం మీమాటకు ఎదురుచెప్పరు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయదారులు రెండు పంటలు లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఐటీ రంగం వారు చిక్కుల నుండి గట్టెక్కుతారు. మహిళలకు సమస్యలు తీరతాయి. జనవరి, మార్చి, మే, ఆగస్టు, సెప్టెంబర్, ప్రతికూల ప్రభావం చూపుతాయి. తరచూ నిర్ణయాలలో మార్పులు, వాహనాలు విషయంలోనూ, ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో విమర్శలు.
అదృష్టసంఖ్య–8, నలుపు, , పసుపు రంగులు అనుకూలం.
మీనం (23 ఫిబ్రవరి – 20 మార్చ్)
కొన్ని వ్యవహారాలలో దిగ్విజయయాత్రలు చేస్తారు. ఆత్మీయుల ద్వారా మీ అంచనాల మేరకు సహాయం అందుతుది. మొత్తానికి మీకు ఎదురులేని పరిస్థితి అనే చెప్పాలి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత కలసివస్తుంది. ఏనిర్ణయంలోనూ వెనుకడుగు వేయరు. అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వహించి ప్రతిభ చాటుకుంటారు. కుటుంబంలో వివాహ వేడుకలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎడబాటు తొలగుతుంది. ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారస్తులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు హోదాలు సంతృప్తినిస్తాయి. పైస్థాయి అధికారుల మనస్సులను గెలుచుకుంటారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. ఏడాది చివరిలో మరిన్ని విజయాలు సాధిస్తారు. వ్యవసాయదారులు పెట్టుబడులు సమీకరణలో సఫలమవుతారు. ఐటీ రంగం వారు పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ఈతిబాధలు తొలగుతాయి. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్, వ్యతిరేకఫలాలు ఉండవచ్చు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువర్గంతో తగాదాలు చోరభయం. మానసికంగా ఆందోళన. ఆరోగ్యం ఇబ్బంది కలిగించవచ్చు.
అదృష్టసంఖ్య–3, గులాబీ, ఆకుపచ్చ, అనుకూలం.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Telugu Yearly Horoscope 2026 content by Vakkantham Chandramouli’s Janmakundali.com.
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.
