Ramayanam – 35 : Hanuman destroys Lanka
రావణుడు ఇచ్చిన రెండు మాసాల గడువు పూర్తయ్యేలోగా రామలక్ష్మణులు వస్తారనీ, రావణుడిని సంహరించి ఆమెను తీసుకువెళతారని సీతాదేవికి హనుమంతుడు ధైర్యం చెబుతాడు. అత్యంత బలపరాక్రమాలు, రాముడి ఆదేశం పట్ల అంకితభావం కలిగిన వానర వీరులు ఎంతోమంది ఉన్నారని అంటాడు. వాళ్లందరూ త్వరలోనే ఆ ప్రదేశానికి చేరుకుంటారని చెబుతాడు. రావణుడి ఆలోచనా విధానం .. ఆయన పరాక్రమం .. ఆయన సేనలు .. ఇలా ఆయనకి సంబంధించిన బలాబలాలపై ఒక అంచనాకు రావడం కోసం, ఆయనను కలిసే వెళ్లాలని హనుమంతుడు అనుకుంటాడు.
అలా అనుకున్నదే తడవుగా రావణుడి అంతఃపుర ప్రాంగణంలోని వనాలను ధ్వంసం చేయడం మొదలు పెడతాడు. అంతటి భారీ కాయంతో కూడిన వానరాన్ని అంతవరకూ చూడని రాక్షస స్త్రీలు భయంతో పరుగులు తీస్తారు. కొంతమంది రాక్షసులు వానరమే కదా కొడితే పారిపోతుందని చెప్పేసి ధైర్యంగా ముందుకు వస్తారు. వాళ్లందరికీ తన శక్తి ఎలాంటిదో హనుమంతుడు చూపిస్తాడు. పెద్ద బండరాళ్లను అవలీలగా ఎత్తేసి వాళ్లపైకి విసురుతూ ఉంటాడు. మహా వృక్షాలను మొదళ్లతో సహా పీకేసి వాటినే అస్త్రాలుగా వదులుతుంటాడు.
ఒక మాయా వానరం మహాకాయంతో లంకానగరంలోకి ప్రవేశించి, వనాలను నాశనం చేస్తుందనే విషయం రావణుడికి తెలుస్తుంది. ఎంతటి బలవంతులైనను దాని ధాటికి తట్టుకోలేకపోతున్నారనీ, మహా పరాక్రమవంతులను సైతం అది మట్టికరిపిస్తోందని ఆయన వింటాడు. ఎలాంటి ఆయుధాలు ఆ వానరాన్ని ఏమీ చేయలేకపోతున్నాయనీ, కాపలా కోసం నియమించబడిన రాక్షస గణమంతా ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు. దాంతో ఆ వానరాన్ని బంధించి తీసుకురమ్మని చెప్పి జంబుమాలిని రావణుడు ఆదేశిస్తాడు.
ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలికి, ఒక వానరానికి అంతా భయపడటం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రాక్షస గణంలో ఒక వానరానికి భయపడేంత పిరికివారు ఉన్నారా? అనుకుంటాడు. ఆ వానరానికి తగిన బుద్ధిచెప్పి తీసుకొచ్చి రావణుడి ముందు పడేస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. చిన్నాభిన్నమైపోయిన వనాలను చూస్తూ ముందుకు సాగుతాడు. హనుమంతుడు కనిపించగానే తన అస్త్రాలకు పని చెబుతాడు. వాటి బారి నుంచి తప్పించుకుంటూ, అదును చిక్కగానే అతణ్ణి హనుమంతుడు హతమారుస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 35 : Hanuman destroys Lanka
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.