Ramayanam – 42 : Ravana thinks about future

లంకానగారానికి హనుమంతుడు వచ్చి వెళ్లిన దగ్గర నుంచి రావణుడి మనసు అల్లకల్లోలంగానే ఉంటుంది. ఒక వానరం సముద్రాన్ని దాటేసి వచ్చింది, సీత జాడ తెలుసుకుని వెళ్లింది. తాను మహాబల సంపన్నుడనని తెలిసి తనముందు నిలిచి మాట్లాడింది. రాముడి శౌర్య పరాక్రమాలను గురించి ధైర్యంగా చెప్పింది. శత్రువులను గజగజలాడించే రాక్షస గణాలు భయంతో పరుగులు పెట్టేలా చేసింది. లంకానగరానికి కాపలాగా ఉన్న లంకిణిని కూల్చేసింది. ఈ విషయాన్ని తాను అంత తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకుంటాడు.

అక్కడి నుంచి నేరుగా అశోకవనంలోకి వెళతాడు. అక్కడ సీతను చూస్తాడు .. ఆమె ముఖంలో ఇదివరకటి భయం లేకపోవడం గమనిస్తాడు. ఆ వానరం వచ్చి వెళ్లిన తరువాతనే ఆమె అలా ధైర్యంగా ఉందని తెలుసుకుంటాడు. ఎప్పటిలానే ఆమెకి తాను ఇచ్చిన గడువును గురించి గుర్తుచేస్తాడు. దొంగచాటుగా ప్రవేశించిన ఒక వానరాన్ని చూసుకుని అహంభావానికి లోనుకావొద్దని చెబుతాడు. తాను కనుసైగ చేస్తే ఆ పరిసర ప్రాంతాల్లోకి చీమ కూడా రాలేదని అంటాడు. పారిపోయిన ఒక వానరం తిరిగి వస్తుందని తాను అనుకోవడం లేదని చెబుతాడు.

ఎప్పటికైనా అధర్మం ఓడిపోవలసిందేననీ, ధర్మం గెలవవలసిందేనని సీత అంటుంది. రాముడి శౌర్య ప్రరాక్రమాలపై తనకి నమ్మకం ఉందని చెబుతుంది. రావణుడి ప్రాణాలను రాముడు తీయడం ఖాయమనీ, ఆ క్షణాల కోసమే తాను ఎదురుచూస్తున్నానని అంటుంది. ఇప్పటికైనా అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడి రాముడిని శరణు కోరమని చెబుతుంది. ఆ మాటలకు రావణుడు అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతాడు. సీత మాత్రం రాముడి గురించిన ఆలోచన చేస్తూ మనసును కుదుటపరుచుకుంటుంది.

సీత మాటలు రావణుడి మనసులో మరింత అలజడి రేపుతాయి. సీత అంత నిబ్బరంగా స్థిరంగా మాట్లాడిందంటే, రాముడు తప్పకుండా వస్తాడనే బలమైన నమ్మకం ఆమెలో ఉందని భావిస్తాడు. ఆమె అనుకున్నట్టుగానే రాముడు రాగలడా? నిజంగానే రాముడు అంతటి పరాక్రమవంతుడా? ఒక వానరం నేరుగా వచ్చిన తన నగరానికి రాముడు రాలేడని అనుకోవడం తన అమాయకత్వమా? రాముడిని తాను తక్కువగా అంచనా వేస్తున్నానా? ఇలా ఆయన మనసు పరిపరివిధాల వెళుతూ ఉంటుంది. దాంతో ఆయన నిద్రకి కూడా దూరమవుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 42 : Ravana thinks about future

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: