Ugadi story and its importance and significance. Ugadi 2024.
తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది (Ugadi) రోజున బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంధాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడుకి ఒక రోజు, అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడుకి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం “యుగ” మరియు “ఆది” అని. ఈ విషయం గురించి పురాణాలలో వున్న ఉగాది కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోమకాసురడనే రాక్షసుడు (హయగ్రీవుడని కూడా పిలుస్తారు) బ్రహ్మ దేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్రగర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టిరచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు “మత్స్యావతారం” ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్రగర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు గనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం.
ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది, ఈ ఉగాది పేరు “క్రోధి” నామ సంవత్సరం. మనకు అరవై ఉగాది పేర్లు ఉన్నాయి అవి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి మరల వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడి తరువాత కీలకమైన గ్రహాలు “శని” మరియు “గురుడు”. ఈ రెండు గ్రహాలు వున్న చోట నుండి బయలుదేరి మరల అదే ప్రదేశానికి తిరిగి రావడానికి అరవై సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి అరవై సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరల వస్తుంది.
ఉగాది రోజున షడ్రుచులు అనగా ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు మరియు జయాపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్ధం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు. ఇందులో “తీపి” కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీకైతే “ఉప్పు” జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిదంగా “చేదు”గా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీకైతే “పుల్ల”ని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు “వగరు”గా ఉండే మామిడి ముక్కలను, సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు “కారాన్ని” ప్రతీకగా చెబుతారు.
ఆలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Ugadi story and its importance and significance. Ugadi 2024.
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.