Sri Bhagavatam – The effect of Mandara’s words on Kaikeyi .. Sita, Rama and Lakshman to Vanavas

దశరథుడు తన కుమారులను .. కోడళ్లను .. ఇతర పరివారమును వెంటబెట్టుకుని అయోధ్యకు బయల్దేరతాడు. ఆ సమయంలో పరశురాముడు వస్తాడు. శివధనుస్సు ఎక్కుపెట్టిన రాముడు వైష్ణవ విల్లును ఎక్కుపెట్టి తన వీరత్వాన్ని చాటుకోవాలని చెప్పి రాముడికి ఇస్తాడు. రాముడి ముఖంలోని దివ్యమైన తేజస్సును గమనించి, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని గ్రహించి వెనుదిరిగి వెళ్లిపోతాడు. ఆ తరువాత అక్కడి నుంచి దశరథుడి పరివారం ముందుకు కదులుతుంది.

కాలం గడిచిపోతూ ఉంటుంది .. తనకి వయసైపోయిందని భావించిన దశరథుడు, రాముడికి పట్టాభిషేకం జరపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు తగిన ఏర్పాట్లను మొదలుపెడతాడు. ఈ విషయాన్ని కైకేయి దగ్గర ప్రస్తావించిన మందర, భరతుడికి పట్టాభిషేకం జరిగేల చూడమని చెబుతుంది. కైకేయిపై ఆ మాటలు ప్రభావం చూపుతాయి. ఆ విషయంలో ఆమె దశరథుడిని వత్తిడి చేస్తుంది. గతంలో తనకి దశరథమహారాజు ఇస్తానని చెప్పిన వరాలను అడ్డుపెట్టుకుని, తాను అనుకున్నది సాధించాలని ఆమె నిర్ణయించుకుంటుంది.

తన కుమారుడైన భరతుడికి సింహాసనాన్ని అప్పగించమనీ, రాముడిని 14 ఏళ్లపాటు అరణ్యవాసానికి పంపించాలని పట్టుపడుతుంది. రాముడు తనకి ప్రాణ సమానుడు కావడంతో, అతనికి ఆ మాట చెప్పలేక .. కైకేయికి ఇచ్చిన మాట తప్పలేక దశరథుడు ఎంతో బాధపడతాడు. రాముడిని అక్కడికి పిలిపించిన కైకేయి, తండ్రి మాటగా ఆమెనే ఆ విషయం చెబుతుంది. తన తండ్రి మాటను పాటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన రాముడు, ఆయన పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.

దశరథుడు తీనుకున్న నిర్ణయం పట్ల కౌసల్య ఆవేదన చెందుతుంది. ఆమెను ఊరడించి రాముడు అడవులకు బయల్దేరతాడు. తన భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండటమే స్త్రీకి చెప్పిన ధర్మం అని సీత కూడా ఆయన వెంట వెళ్లడానికి సిద్ధపడుతుంది. తన అన్నయ్య రామచంద్రుడు లేని రాజ్యంలో తాను ఉండలేనని చెప్పి, వాళ్లతో వెళ్లడానికి లక్ష్మణుడు ఆసక్తిని చూపుతాడు. ముగ్గురూ కూడా అడవులకు బయల్దేరతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – The effect of Mandara’s words on Kaikeyi .. Sita, Rama and Lakshman to Vanavas