Sri Bhagavatam – Parasurama kills Kartaviryarjuna

కార్తవీర్యుడి మాటలకు పరశురాముడు నవ్వుతాడు. పరాక్రమం అంటే వేయి చేతులు కలిగి ఉండటం కాదు .. వేలమంది సైన్యాన్ని చుట్టూ పెట్టుకుని విర్రవీగడం కాదు. ఆయుధసామాగ్రిని చూసుకుని మురిసిపోవడం కాదు. తాను ఆశ్రమ జీవిని .. తల్లిదండ్రుల సేవలో ఉన్నవాడిని .. కామధేనువును ప్రాణసమానంగా చూసుకునేవాడిని .. కందమూలాలు తినే వాడిని .. అలాంటివాడిని ఒక్కడినే వచ్చాను .. పరాక్రమం అంటే ఇది అని అంటాడు. తనది కానీ ప్రదేశంలో .. తనవాళ్లు వెంటలేని ప్రదేశంలో ఎదిరించడం పరాక్రమం అని చెబుతాడు.

కామధేనువును వెంట తీసుకుని వస్తానని నా తల్లికి మాట ఇచ్చాను. తల్లికి ఇచ్చిన మాట .. ఆ తల్లి ఇచ్చిన ఆశీస్సుల ముందు ఎదుటివారి పరాక్రమం పనిచేయదు. ఇందుకు దేవతలు కూడా మినహాయింపు కాదు అని పరశురాముడు చెబుతాడు. ధర్మం తన పక్షాన ఉంది .. అధర్మం అతని వైపు ఉంది. ధర్మం పరాక్రమమాన్ని పెంచుతుంది .. అది విజయం సాధించేవరకూ తోడుగా ఉంటుందనీ, అధర్మానికి అపజయాన్ని అందుకోవడమే అలవాటనే విషయాన్ని ఆయన గ్రహించకపోవడం విచారించదగిన విషయం అంటాడు.

మహా పరాక్రమవంతుడైన కార్తవీర్యుడు .. ఒక ఆశ్రమజీవితో ఇన్నేసి మాటలు అనిపించుకుంటూ, ఇంతసేపు కాలాన్ని వృథా చేయడం తన తప్పు. యుద్ధం చేయడానికి అతను అంత ముచ్చటపడుతుంటే కాదనడం భావ్యం కాదు. అంతటి వీరుడివే అయితే తనని గెలిచే కామధేనువును తీసుకెళ్లు అంటూ ఆయన యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య పోరు భీకరంగా జరుగుతుంటుంది. కార్తవ్యుడు సంధిస్తున్న బాణాలను ఎదుర్కొంటూనే, గొడ్డలితో పరశురాముడు అతనిపై విరుచుకు పడుతుంటాడు. ఆయన ధాటికి కార్తవీర్యుడు తట్టుకోలేకపోతుంటాడు.

వేయి చేతులతో కార్తవీర్యుడు బాణాల వర్షం కురిపిస్తూ ఉన్నా, పరశురాముడు వాటిని తప్పించుకుంటూ వెళ్లి అతని వేయి చేతులను తెగ నరుకుతాడు. ఒక్కసారిగా కార్తవ్యుడు కుప్పకూలిపోతాడు. అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయి. పరశురాముడు కామధేనువును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకుంటాడు. కామధేనువు తిరిగి వచ్చినందుకు రేణుకాదేవి సంతోషంతో పొంగిపోతుంది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Parasurama kills Kartaviryarjuna