Ramayanam – 40 : Hanuman returns back from Lanka
హనుమంతుడు ఎంతో ఆనందంగా ఉంటాడు, రాముడికి ఎంతో సంతోషాన్ని కలిగించే సమాచారంతో వెళుతున్నందుకు పొంగిపోతూ ఉంటాడు. రాముడి పరాక్రమాన్ని తక్కువగా అంచనా వేసిన రావణుడికి, దూత బలం ఏపాటిదో తెలియజెప్పినందుకు సంతృప్తితో ఉంటాడు. అలా ఎంతో ఉత్సాహంతో ఆయన సముద్రంపై ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ, ఇవతలి తీరానికి చేరుకుంటాడు. ఎన్నో రోజులుగా హనుమంతుడి రాకకోసం అక్కడే వేచి చూస్తున్న వానర వీరులు, హనుమంతుడు కనిపించగానే సంతోషంతో కేకలు వేస్తారు.
హనుమంతుడు నేలపై అడుగుపెట్టగానే అందరూ ఆయన చుట్టూ చేరతారు. సీతమ్మతల్లి క్షేమంగానే ఉందనీ, ఆ తల్లిని కలుసుకునే వస్తున్నానని వాళ్లతో హనుమంతుడు చెబుతాడు. రాక్షస గణాలు తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే తగిన గుణపాఠం చెప్పివచ్చానని అంటాడు. సీతమ్మతల్లి పరిస్థితిని చూసి తనకి చాలా బాధ కలిగిందనీ, రాముడే వచ్చి తనని తీసుకెళ్లాలని ఆ తల్లి ఆవేదన చెబుతాడు. రావణుడు తనకి మహా అహంభావిగా కనిపించాడనీ, ఆయన సోదరుడైన విభీషణుడు మాత్రం మంచి ఆలోచన చేసే లక్షణం కలిగినవాడని అంటాడు.
హనుమంతుడు సాధించుకు వచ్చాడు, కార్యదీక్షా పరుడని నిరూపించుకున్నాడు. రాముడి వెంట ఎంతటి బలమైన సైన్యం ఉందనే విషయాన్ని రావణుడికి అర్థమయ్యేలా చేసి వచ్చాడు. ఇప్పటివరకూ దిగులుపెట్టుకున్న సీతమ్మ ఇకపై ధైర్యంగా ఉండేలా చేసి వచ్చాడు. అందువలన జాంబవంతుడితో సహా ఇతర వానర వీరులంతా కూడా హనుమంతుడిని అభినందిస్తారు. సుగ్రీవుడు అప్పగించిన పనిని హనుమంతుడు విజయవంతంగా పూర్తి చేసి వచ్చినందుకు వాళ్లంతా గర్వపడతారు. ఆ సంతోషంతో అంతా అక్కడ సంబరాలు చేసుకుంటారు.
దక్షిణ దిక్కుగా వెళ్లిన హనుమంతడి కోసం రామలక్ష్మణులు ఎదురుచూస్తుంటారు. ఆ వైపు నుంచి ఎలాంటి కబురు వస్తుందా అని వాళ్లు ఆత్రుతతో ఉంటారు. హనుమంతుడు వెళ్లిన పనిని పూర్తి చేసుకుని వస్తాడనే తమ మనసుకు సర్దిచెప్పుకుంటూ ఉంటారు. అలా కాని పక్షంలో తాము ఏం చేయాలనే ఆలోచనలోను మునుగుతుంటారు. అలా సీతాదేవికి సంబంధించిన ఆలోచనలో వాళ్లు సతమతమైపోతుండగా, బయట ఏదో అలికిడి అవుతుంది. హనుమంతుడు ఇతర వానర వీరులతో కలిసిరావడం చూసి ఒక్కసారిగా వాళ్లకి ప్రాణం లేచొస్తుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 40 : Hanuman returns back from Lanka
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.