Ramayanam – 4 : Killing of Tataka
రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ, తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గమధ్యంలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు. ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు. అలా వాళ్లు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి.
ఉరుములు, మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చేసి రామలక్ష్మణుల మీద పడబోతుంటాయి. వాటి బారి నుంచి వాళ్లు తప్పించుకుంటూ, విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచ సుబాహుల తల్లి అయిన “తాటకి” పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. అంతలో పెకిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ల వైపు దూసుకువస్తాయి. చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు. “తాటకి” స్త్రీ కావడంతో, ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు.
రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో, తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకువస్తుంటుంది. రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దనీ, లోక కళ్యాణ కారకమైన దైవకార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయముందని చెబుతాడు. తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకీకి రుచి చూపిస్తారు.
రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలుపెడతారు. వాళ్ల అస్త్రాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండటంతో, తాటకి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లపై విరుచుకుపడటానికి ప్రయత్నించి విఫలమవుతుంది. రామలక్ష్మణుల బాణాల ధాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది. తన కుమారులైన మారీచ, సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది. దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 4 : Killing of Tataka
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.