Ramayanam – 24 : Lakshmana rekha to secure Sita

బంగారులేడిని వేటాడుతూ అడవి లోపలికి రాముడు వెళతాడు. ఆ వైపు నుంచి “సీతా .. లక్ష్మణా” అంటూ రాముడు బాధగా అరిచినట్టు అరుపులు వినిపిస్తాయి. దాంతో సీత తీవ్రమైన కలవరపాటుకు లోనవుతుంది. రాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తోందనీ, వెంటనే వెళ్లి రక్షించే ప్రయత్నం చేయమని చెబుతుంది. అందుకు లక్ష్మణుడు ఆందోళన చెందకుండా, కంగారుపడవలసిన పనిలేదని చెబుతాడు. రాముడికి ఎలాంటి ఆపద కలగదని అంటాడు. ఇదంతా రాక్షస మాయ అనిపిస్తోందని చెబుతాడు.

రాముడి శౌర్యపరాక్రమాలను తాను ప్రత్యక్షంగా చూసినవాడిననీ, ఆయనను ఏ శక్తి ఎదురించలేదనీ ఏ మాయ ఏమీ చేయలేదని ఆత్మవిశ్వాసంతో లక్ష్మణుడు చెబుతాడు. అనవసరమైన ఆందోళన తగదనీ, రాముడు సురక్షితంగా తిరిగివస్తాడని అంటాడు. తాను అంతగా కలవరపాటు చెందుతుంటే, లక్ష్మణుడు నింపాదిగా సమాధానం ఇవ్వడం పట్ల సీతాదేవి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. అతని మనసులో ఏదో దురుద్దేశం ఉందనీ, అందువల్లనే అతను కదలక మెదలక ఉంటున్నాడంటూ నిందిస్తుంది.

సీతాదేవి అలా నిందించడంతో లక్ష్మణుడు ఎంతో ఆవేదన చెందుతాడు. ఆమెలో తాను తన తల్లిని చూసుకుంటున్నానని అంటాడు. అలాంటి తనని అంతలేసి మాటలనడాన్ని తట్టుకోలేకపోతున్నానని అంటూ ఆవేదన చెందుతాడు. రాముడికి ఇచ్చిన మాటను అతిక్రమించిన పాపం తగిలినా ఫరవాలేదుగానీ, అంతకంటే పదునైన మాటలను తాను వినలేనంటూ బాధపడతాడు. సీతను ఒంటరిగా వదిలేసి రావద్దని రాముడు చెప్పిన కారణంగా ఏం చేయాలా అని ఆలోచన చేస్తాడు. ఆశ్రమ ద్వారానికి అడ్డుగా ఒక రేఖ గీస్తాడు.

జరుగుతున్న సంఘటనలు రాక్షస మాయగా తనకి తోస్తున్నదనీ, అందువలన ఎలాంటి పరిస్థితుల్లోను ఆ రేఖను దాటి బయటికి రావొవద్దని చెబుతాడు. ఎవరినీ నమ్మవద్దనీ ఎక్కడికి వెళ్లవద్దని అంటాడు. తాను రాముడితో కలిసి వచ్చేంతవరకూ ఆశ్రమంలోనే ఉండమని చెబుతాడు. ఆయన మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది. అయినా తనని వదిన అపార్థం చేసుకుంటుందేమోనని ముందుకు కదులుతాడు. ఆ వైపు నుంచి రాముడు కూడా ఆశ్రమం దిశగా వడివడిగా నడిచి వస్తూనే ఉంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 24 : Lakshmana rekha to secure Sita

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: