Ramayanam – 90 : Lord Rama requests Sita to come to Ayodhya
రాముడు, సీత, లవకుశులను ఉద్దేశించి వాల్మీకి మహర్షి మాట్లాడుతూ ఉండగా, లక్ష్మణుడు – శత్రుఘ్నుడు అక్కడికి వస్తారు. లవకుశులు ఎవరనేది తెలుసుకుని సంతోషంతో పొంగిపోతారు. రఘువంశానికి చెందిన వీరులు కనుకనే, వాళ్లకి విలువిద్యలో అంతటి నైపుణ్యం వచ్చిందని అంటారు. తమ అన్నావదినలు తిరిగి కలుసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కాలం పెట్టిన కఠిన పరీక్షలను తట్టుకుని నిలబడిన సీతాదేవిని ప్రశంసిస్తారు.
సీతమ్మవారు లేని అయోధ్య ఆనాటి నుంచి నేటివరకూ కళావిహీనమై ఉందనీ, ప్రజలంతా కూడా ఆమెను స్మరించుకుంటూనే ఉన్నారని లక్ష్మణుడు అంటాడు. సీతాదేవి లేని రాముడు ఎలా ఉన్నాడనే విషయం ఆమె ఊహించడం కూడా కష్టమేనని చెబుతాడు. రాముడు ఎలాంటి విందు వినోదాలను ఎరుగక, ఏకాంతంలోనే కాలాన్ని గడిపాడని అంటాడు. నిరంతరం ఆయన మనసు ఆవేదనకు లోనయ్యే ఉండేదని చెబుతాడు. ఆయన అయోధ్యలో ఉన్నప్పటికీ ఆయన మనసు అరణ్యాల చుట్టూనే తిరిగిందని అంటాడు.
రాముడు మాత్రమే కాదు ఆమె గురించి ముగ్గురు అత్తలు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారని లక్ష్మణుడు చెబుతాడు. సీతా దేవిని వాళ్లు తలచుకోని క్షణం లేదని అంటాడు. ముఖ్యంగా కౌసల్యాదేవి కన్నీళ్లు పెట్టని సమయం లేదని చెబుతాడు. అలాంటి వాళ్లంతా కూడా అయోధ్యలో సీతాదేవి అడుగుపెడితే ఆనందంతో పొంగిపోతారని అంటాడు. ఆమె రాకనే వాళ్ల ఆవేదనకు ఔషధమని చెబుతాడు. సీతారాములు తిరిగి అయోధ్య సింహాసనంపై కనిపిస్తే అంతకుమించిన అదృష్టం లేదని ప్రజలంతా భావిస్తారని అంటాడు.
సీతాదేవి కాలు పెట్టడంతోనే అయోధ్య నగరం పవిత్రమవుతుందనీ, ఎప్పటిలా పంటలు పుష్కలంగా పండుతాయని శత్రుఘ్నుడు అంటాడు. ఆమె రాకతోనే అయోధ్యలో ఆనందాలు, సంతోషాలు వెల్లి విరుస్తాయని చెబుతాడు. జరిగినదానికి అయోధ్య ప్రజలంతా కూడా ఎంతగానో బాధపడుతున్నారని అంటాడు. ఆమె రాకతో వాళ్లందరి మనసులు తేలిక పడతాయని చెబుతాడు. అందరం కలిసి అయోధ్యకు బయల్దేరదామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. సీతాదేవి క్షణకాలం పాటు ఆలోచన చేస్తుంది. ఆమె నిర్ణయంకోసం రాముడు ఎదురుచూస్తూ ఉంటాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 90 : Lord Rama requests Sita to come to Ayodhya
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.