Ramayanam – 47 : Ramsetu bridge to Lanka with help of Vanara sena
సముద్రంపై వారధి నిర్మాణానికి సంబంధించిన పనులు చకచకా జరుగుతుంటాయి. నలుడు, నీలుడు ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉండగా ఇతర వానరవీరులు వాళ్లకి సహకరిస్తూ ఉంటారు. వానర వీరులలో ఒక్కరు కూడా విరామమనేది ఎరుగకుండా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయకుండా వాళ్లు పడుతున్న కష్టాన్ని చూసి రాముడి కళ్లు చెమ్మగిల్లుతాయి. వానరులు అందిస్తున్న సహాయ సహకారాలు మరిచిపోలేనివని లక్ష్మణుడితో అంటాడు.
ఇలా సముద్రంపై వారధి నిర్మాణపు పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడ రావణుడి మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. రాముడు వానర వీరులతో కలిసి లంకానగరానికి రావడం తప్పక జరుగుతుందని ఆయన మనసుకి అనిపిస్తూ ఉంటుంది. తన తేజస్సు, తన సభా భవనం యొక్క తేజస్సు తగ్గినట్టుగా అనిపిస్తుంది. తనలో ఇదివరకటి ఉత్సాహం, ధైర్యం తగ్గాయేమోననే ఆలోచన కలుగుతుంది. తనకి అలా అనిపిస్తుందా? లేక నిజంగానే అలా జరుగుతుందా? అనే సందేహం ఆయనను సతమతం చేస్తుంటుంది. ఎక్కువగా ఏకాంతంలో పచార్లు చేయడానికి ఆయన అలవాటుపడిపోతాడు.
వానరవీరులు ఒక యజ్ఞంలా తలపెట్టిన వారధి నిర్మాణం పూర్తవుతుంది. వానర వీరులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. రాముడి కళ్లు ఆనంద బాష్పాలను వర్షిస్తాయి. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే సాధించలేనిది లేదు అనే విషయాన్ని ఈ లోకానికి చాటిన వానర వీరులను రాముడు అభినందిస్తాడు. వానర వీరులు అందించిన ఈ సహకారం ఆ చంద్రతారార్కం నిలిచిపోతుందని అంటాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత కఠినమైన ఈ పనిని పూర్తి చేసినందువలన, వానరజాతి పూజించబడుతుందని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు.
వానర సమూహాలు ముందుగా నడుస్తూ ఉండగా రామలక్ష్మణులు కదులుతారు. మరికొన్ని వానర సమూహాలు వాళ్ల వెనకగా అనుసరిస్తూ ఉంటాయి. వానర సైనికులు జయజయ ధ్వానాలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. వెనకగా అనుసరిస్తున్న వానరులు కూడా రాముడి గుణగణాలను కీర్తిస్తూ ఉంటారు. తేలికపడిన మనసుతో, కొత్త ఉత్సాహంతో రాముడు ముందుకు సాగుతుంటాడు. సీతకి దగ్గరవుతున్నాననే సంతోషం ఆయన తేజస్సును మరింత పెంచుతుంది. అక్కడ సీతమ్మ కూడా రాముడిని స్పర్శించిన గాలి తనని తాకుతున్న అనుభూతికి లోనవుతూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 47 : Ramsetu bridge to Lanka with help of Vanara sena
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.