Ramayanam – 46 : Vibhishana seeks refuge with Rama

రాముడి దగ్గరకి విభీషణుడు వస్తాడు, శరణు కోరతాడు. తనకి తానుగా పరిచయం చేసుకుంటాడు. అయితే వానర వీరులు అతనిని నమ్మడానికి వీల్లేదని అంటారు. లక్ష్మణుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. తనకి ఎలాంటి దురుద్దేశం లేదనీ, సీతమ్మను రాముడికి అప్పగించి శరణు కోరమని తన సోదరుడికి చెప్పాననీ, ఆయన వినిపించుకోకపోగా తనపట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాడని చెబుతాడు. అందువలన తాను ఆయన ఆశ్రయానికి దూరమయ్యానని అంటాడు. రాముడికి మేలు చేయాలనే ఆలోచనే తప్ప, కీడు చేయాలనే ఉద్దేశం లేదని చెబుతాడు.

రాముడు, విభీషణుడి మాట తీరును ఆయన ధోరణిని సునిశితంగా పరిశీలిస్తాడు. విభీషణుడి మాటల్లో అసత్యం లేదనీ, ఆయన నిజమే మాట్లాడుతున్నాడని గ్రహిస్తాడు. అందువలన ఆయనను నమ్మవచ్చని భావిస్తాడు. విభీషణుడిని నమ్మవచ్చనీ, ఆయన వలన తమకి ఎలాంటి ప్రమాదం సంభవించదని వానరులతో చెబుతాడు. కనుక అందరూ కూడా తనతో పాటుగా విభేషణుడిని తమ ఆత్మీయుడిగానే చూడాలని అంటాడు. అందుకు లక్ష్మణుడితో సహా అంతా కూడా అంగీకరిస్తారు. రాముడికి భక్తి శ్రద్ధలతో విభీషణుడు నమస్కరించుకుంటాడు.

లంకానగరంలో రావణుడి పరిస్థితి .. సైనిక బలగాలు .. రావణుడు నమ్మిన మహాబలవంతులను గురించి చెప్పమని రాముడు విభీషణుడిని అడుగుతాడు. దాంతో లంకానగరంలో ఏయే దిక్కున ఏమేం ఉన్నాయో విభీషణుడు చెబుతాడు. రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు, కుమారుడైన ఇంద్రజిత్తు మహాబలవంతులని చెబుతాడు. కుంభకర్ణుడు ఒక్కడే కొన్ని వేలమందిని అంతం చేయగలడని అంటాడు. ఇక ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో యుద్ధం చేస్తాడనీ, శత్రువుల బాణాలకు ఆయన దొరకడని చెబుతాడు.

ఇక రావణుడి సేనాపతి ప్రహస్తుడు మహా మేధావి అనీ, తన సైనిక బలగాలను నడిపించడంలోను, శత్రువుల సైనిక బలగాలను నియంత్రించడంలోను ఆయనకి మంచి నైపుణ్యం ఉందని అంటాడు. ప్రహస్తుడి నుంచి ఆదేశం రావడమే ఆలస్యం, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే రాక్షస వీరులు కోట్లకొలది ఉన్నారని చెబుతాడు. ఆయన నుంచి అన్ని వివరాలను తెలుసుకున్న రాముడు, యుద్ధం విషయంలో అనుసరించవలసిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటాడు. రావణ సంహారం చేసి ఆ రాజ్యానికి విభీషణుడినే రాజుగా చేస్తాననే విషయాన్ని స్పష్టం చేస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 46 : Vibhishana seeks refuge with Rama

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: