Ramayanam – 32 : Sita in Ashokavanam with demons as security
సీతాదేవిని అపహరించిన రావణుడు ఆమెను లంకా నగరంలోని అశోకవనంలో ఉంచుతాడు. అక్కడ ఉన్న రాక్షస గణాల మధ్య సీతాదేవి భయం భయంగా రోజులు గడుపుతూ ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ ఓ చెట్టు క్రింద కూర్చుంటుంది. ఆమెకు రాక్షస స్త్రీలను రావణుడు కాపలాగా ఉంచుతాడు. రామలక్ష్మణులు సాధారణ మానవులనీ, వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోను సముద్రాన్ని దాటి లంకానగరానికి రాలేరని రావణుడు పదే పదే సీతకు గుర్తుచేస్తూ ఉంటాడు. ఒకవేళ వచ్చినా తన శౌర్య ప్రక్రమాల ముందు వాళ్లు నిలవలేరనీ, తన మాయాశక్తిని వాళ్లు కనీసం ఊహించలేరని మానసికంగా ఆమెను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆమెకి ఇచ్చిన ఏడాది గడువులోగా మనసు మార్చుకోవడం మంచిదని అంటాడు. మనసు మార్చుకున్న మరుక్షణమే ఆమెకి అంతఃపురంలో సమస్త వైభవాలు అందుబాటులోకి వస్తాయని చెబుతాడు. అనవసరమైన కాలయాపన చేయడం వలన అవస్థలు పడటమేతప్ప, ఆశలు ఫలించవని అంటాడు. తెలివైనవారు తమని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారనీ, మూర్ఖులు మాత్రమే మొండికేస్తారని చెబుతాడు. సీతాదేవి మనసుమార్చుకుంటే, తనకి వెంటనే తెలియపరచమని రాక్షస స్త్రీలను ఆదేశించి వెళ్లిపోతాడు.
సీతాదేవికి రాముడు కళ్ల ముందు కదలాడతాడు. మనోహరమైన ఆయన రూపం, ఆయన పలకరింపు ఆమె మదిలో మెదులుతుంది. తన కోసం రాముడు ఎంతగా తపిస్తున్నాడో అనుకుని కన్నీళ్ల పర్యంతమవుతుంది. అనవసరంగా లక్ష్మణుడిని అనరాని మాటలు అనేసి ఆశ్రమం వదిలివెళ్లేలా చేశాను, ఆయన ఉండి ఉంటే రావణుడు ఇంతటి సాహసానికి పాల్పడేవాడు కాదని విలపిస్తోంది. లక్ష్మణుడు గీసిన గీతనైనా దాటకుండా ఉండవలసింది. అతను చెప్పిన మాట వినకుండా గీత దాటడం వలన ఇంతటి అనర్థం జరిగింది అనుకుంటూ దుఃఖిస్తుంది.
తనని వెదుకుతూ రామలక్ష్మణులు బయల్దేరే ఉంటారు. అయితే తనని తీసుకొచ్చింది రావణుడు అని వాళ్లకి ఎలా తెలుస్తుంది? తనని ఏ మార్గంలో లంకానగరానికి తీసుకొచ్చింది వాళ్లు ఎలా పసిగడతారు? అసలు ఈ లంకానగరం ఎక్కడ ఉంది? ఎలా రామలక్ష్మణులు ఈ ప్రదేశానికి చేరుకోగలరు? తాను వదిలిన ఆభరణాలు వాళ్ల కంటపడతాయా? తన ఆచూకీ తెలుసుకుని వాళ్లు వచ్చేంతవరకూ ఈ రాక్షస స్త్రీలు తనని బ్రతకనిస్తారా? అంటూ ఆందోళన చెందుతుంది. రామలక్ష్మణుల అన్వేషణ ఫలించేలా చూడమని మనసులోనే దైవాన్ని ప్రార్ధిస్తుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 32 : Sita in Ashokavanam with demons as security
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.