Ramayanam – 25 : Sita kidnap

బంగారులేడి కోసం ఆ అడవిలో మరింత లోపలికి రాముడు వెళతాడు. సీతమ్మ మాటను కాదనలేక లక్ష్మణ రేఖను గీసి ఆ దిశగా లక్ష్మణుడు వెళతాడు. ఆ ఇద్దరి కోసం ఎదురుచూస్తూ సీతాదేవి ఆశ్రమంలోనే ఉండిపోతుంది. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న రావణుడు, జంగమదేవర వేషంలో అక్కడికి వస్తాడు. “భవతీ భిక్షామ్ దేహి” అంటూ ఆశ్రమ వాకిలిలో నిలుస్తాడు. సీతాదేవి ఆయనకి భిక్ష తీసుకురావడానికి వెళుతుంది. అదే సమయంలో లక్ష్మణుడు గీసిన రేఖను రావణుడు చూస్తాడు. ఆ రేఖను దాటుకుని ఇతరులు ఎవరూ లోపలికి వెళ్లలేరని గ్రహిస్తాడు.

సీతాదేవి భిక్ష తీసుకుని వస్తుంది, లక్ష్మణ రేఖను దాటుకుని బయటికి రావడానికి ఆమె సందేహిస్తుంది. ఆయననే లోపలికి వచ్చి భిక్ష తీసుకోమన్నట్టుగా చూస్తుంది. ఆ చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన రావణుడు, తాను లోపలికి రానని అంటాడు. ఆమెనే వచ్చి భిక్ష వేయాలని అంటాడు. తీసుకువచ్చిన భిక్షను తిరిగి లోపలికి తీసుకెళ్లడం పాపమని చెబుతాడు. దాంతో ఏం చేయాలో తెలియక సీతాదేవి అయోమయానికి లోనవుతుంది. రావణుడు ఆమెకి ఆలోచించే సమయం ఇవ్వకుండా కంగారుపెడుతూ ఉంటాడు.

బంగారులేడిని వేటాడడానికి వెళ్లిన రాముడు కంగారుగా అక్కడి నుంచి తిరిగి వస్తుంటాడు. అదే సమయంలో ఆయనకి లక్ష్మణుడు ఎదురుపడతాడు. అప్పటివరకూ సీతకి తోడుగా అండగా లక్ష్మణుడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్న రాముడు, లక్ష్మణుడిని చూడగానే ఒక్కసారిగా కంగారుపడతాడు. సీతాదేవిని ఒంటరిగా వదిలి రావొద్దని చెబితే ఎందుకు వచ్చావు? అని అడుగుతాడు. తాను ఏమీ చెప్పలేననీ, తనని మన్నించమని లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో లక్ష్మణుడిని వెంటబెట్టుకుని మరింత వేగంగా రాముడు నడకసాగిస్తాడు.

రావణుడికి భిక్ష ఇవ్వడానికి సీతాదేవి లక్ష్మణ రేఖను దాటుకుని బయటికి వస్తుంది. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న రావణుడు ఒక్కసారిగా తన నిజరూపం ధరిస్తాడు. తన పథకం ఫలించిందనే ఆనందంతో ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతాడు. ఆ నవ్వుకు అరణ్యంలోని క్రూరమృగాలు సైతం భయపడిపోయి గుహల్లో దాక్కుంటాయి. చెట్లపై ఉన్న పక్షులు ఒక్కసారిగా చెదిరిపోయి, తిరిగి వాలడానికి సంకోచిస్తూ ఉంటాయి. సీతాదేవి భయాందోళనలకులోనై స్పృహతప్పి పడిపోతుంది. అంతే ఒక్క క్షణమైనా నిలవకుండా సీతాదేవి పడిపోయిన ప్రదేశాన్ని పెకిలించి, ఆకాశమార్గాన ఆమెను తీసుకెళుతుంటాడు.

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Ramayanam – 25 : Sita kidnap

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: