Ramayanam – 2 : Vishwamitra arrives
కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురూ కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ల విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్లు ఆరితేరేలా చూడమని కోరతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ల విద్యాభ్యాసం పూర్తవుతుంది. పిరికితనమనేది తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. వాళ్ల శౌర్య పరా క్రమాలను గురించి తెలుసుకుని దశరథుడు సంతోషిస్తాడు.
రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురూ కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్లను గురించి అయోధ్య వాసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ల గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్లను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి.
ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా, విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు. ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు. అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతాడు. విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలు చాటుకుంటాడు.
విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడటానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారనీ, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్లడం లేదని చెబుతాడు. ఒక మహావీరుడు యాగ రక్షకుడిగా నిలబడితే తప్ప, యాగం పూర్తికాదని అంటాడు. యాగ రక్షణ గావిస్తూ, రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొస్తానని అంటాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 2 : Vishwamitra arrives
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.