Sri Bhagavatam – Surpanakha’s outcry

అడవులలోని మహర్షుల ఆశ్రమాలను దర్శించుకుంటూ సీతారామలక్ష్మణులు ముందుకు సాగుతుంటారు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత, ఆహ్లాదకరమైన ఒక ప్రదేశంలో విడిది చేస్తారు. సీతారాముల ఆదేశంతో లక్ష్మణుడు అక్కడ పర్ణశాలను నిర్మిస్తాడు. అక్కడి వాతావరణం నచ్చడంతో అప్పటివరకూ పడుతూ వచ్చిన కష్టాలను మరిచిపోయి సీతాదేవి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి సమయంలోనే అటుగా వచ్చిన “శూర్పణఖ” వాళ్లను చూస్తుంది. రాముడి దివ్యమోహన విగ్రహం చూసి అతని చేరువకు వెళుతుంది.

రాముడు ఆమె పట్ల ఎలాంటి భావన వ్యక్తం చేయకుండా లక్ష్మణుడిని చూపిస్తాడు. దాంతో శూర్పణఖ ఆతని దగ్గరికి వెళ్లి, అతనిపై తనకి గల కోరికను వ్యక్తం చేస్తుంది. ఆవేశపరుడైన లక్ష్మణుడు ఆమె ముక్కూ చెవులూ కోసి పంపిస్తాడు. కోరి చెంత చేరితే తనని అవమానపరిచిన వాళ్లను అంత తేలికగా వదలకూడాదని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ క్షణమే తన సోదరుడైన రావణాసురిడి దగ్గరికి వెళుతుంది. ఆమె పరిస్థితిని చూసిన ఆయన విషయమేమిటని అడుగుతాడు.

తాను సీత అనే ఒక స్త్రీని చూశాననీ, ఎంతో సౌందర్యరాశి అయిన ఆమె ఆతనికి భార్య అయితే బాగుంటుందని భావించానని అంటుంది. ఆ పనిని చక్కబెట్టబోతే ఆమె భర్త .. మరిది ఇద్దరూ కలిసి తన ముక్కుకోసి అవమాన పరిచారని చెబుతుంది. ఎలాగైనా ఆ సౌందర్యరాశిని సొంతం చేసుకోమని అంటుంది. తన సోదరిని అవమానపరిచినవారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనీ, అలాగే మహా సౌందర్యరాశిగా చెప్పబడుతున్న ఆ సీతను తాను సొంతం చేసుకోవాలని రావణుడు నిర్ణయించుకుంటాడు.

వెంటనే ఆయన మారీచుడిని రప్పిస్తాడు. తాను సీతను అపహరించాలని అనుకుంటున్నట్టుగా చెబుతాడు. బంగారులేడి రూపాన్ని ధరించి సీతను ఆకర్షించమనీ, ఆ తరువాత రాముడిని ఆశ్రమానికి దూరంగా తీసుకెళ్లమని అంటాడు. గతంలో రాముడి పరాక్రమాన్ని చూసిన మారీచుడు .. రావణుడికి మంచి చెప్పడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. దాంతో రాముడి చేతిలో మరణించడమే మంచిదని నిర్ణయించుకుంటాడు. రావణుడు చెప్పినట్టుగానే లేడిగా మారిపోయి మెరుస్తూ సీతకి కనిపిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Surpanakha’s outcry