Today rashi phalalu – 01 మార్చి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
యత్నకార్యసిద్ధి. భార్యాభర్తలు కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. వాహనాలు, ఖరీదైన నగలు సమకూర్చుకుంటారు. ధార్మికవేత్తలను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగవర్గాలకు కొంతమేర ఇంక్రిమెంట్లు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకు సంఘపరంగా గౌరవం. అనుకూల రంగులు….. గులాబీ, లేతపసుపు. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలలో మరింత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. దేవాలయాల సందర్శనం. వ్యాపార, వాణిజ్యవేత్తలు చికాకుల మధ్యనే లావాదేవీలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మహిళలకు కొంత చికాకులు తప్పవు. అనుకూల రంగులు….. గులాబీ,లేతఎరుపు. ప్రతికూల రంగు….నలుపు. వినాయకునికి అర్చనలు చేయండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను ప్రగతిపథంలో నడుపుతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి అనుకూల సమాచారం. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు….. కాఫీ,ఆకుపచ్చ. శ్రీ గురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు. రాబడికి మించిన ఖర్చులు అధికం. ఇంటాబయటా కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ తప్పదు. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని వివాదాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు మరింత నిదానం పాటించాలి. విద్యార్థులు ఎంత శ్రమపడ్డా ఫలితం అందుకోలేరు. మహిళలకు కుటుంబపరంగా చికాకులు ఎదురవుతాయి. అనుకూల రంగులు….. గులాబీ,పసుపు. ప్రతికూలరంగు….నేరేడు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలపై బంధువులతో సంప్రదింపులు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. సన్నిహితులు, స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగులకు ఊహించని బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. మహిళలకు బంధువుల నుండి పిలుపు. అనుకూల రంగులు….. గోధుమ,ఆకుపచ్చ. ప్రతికూలరంగు.. నీలం.. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలోని పట్టుదల చూసి బంధువులు ఆశ్చరపడతారు. ఆదాయపరంగా మరింత పురోభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి విషయాలలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. సాంకేతిక నిపుణులు, వైద్యులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు….. గులాబీ,లేత ఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. గణేశాష్టకం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆర్థికపరమైన చికాకులు ఎదుర్కొంటారు. మీ నైపుణ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్లు లావాదేవీలను కొంత నిదానంగా సాగిస్తారు. ఉద్యోగవర్గాలకు అదనపు పనిభారం. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు అనుకోని వివాదాలు. విద్యార్థులకు చికాకులు. మహిళలకు మానసిక వేదన. అనుకూల రంగులు….. ఎరుపు,కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. కొన్ని వివాదాలు ఇబ్బందిపెట్టవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు,సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు ఫలిస్తాయి.. విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు….. పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు….తెలుపు. అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిరకాల వివాదాలు తీరతాయి. కార్యక్రమాలు ఆటంకాలను అధిగమించి పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కలసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల విషయంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీయానం. విద్యార్థులు ఆశించిన అవకాశాలు పొందుతారు. మహిళలకు సోదరుల నుంచి ఆహ్వానాలు. అనుకూల రంగులు….. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు….పసుపు. హనుమాన్ఛాలీసా పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభ వార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సంతోషకరంగా గడుస్తుంది. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలను సాధిస్తారు. మహిళలకు ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకూల రంగులు….. కాఫీ, బంగారు. ప్రతికూల రంగు ….ఎరుపు. గణపతికి అభిషేకం చేయండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువులతో అకారణ వైరం. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లు మరింత జాగ్రత్త పాటించాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు మందకొడిగా సాగి లాభాల పై నిరాశ చెందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు ….కాఫీ. శివాష్టకం పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం, ఒత్తిడులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు శ్రమపడతారు తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు చికాకులు. అనుకూల రంగులు…..గోధుమ, పసుపు. ప్రతికూల రంగు….నేరేడు. వేంకటేశ్వరస్వామికి అర్చనలు చేయండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com