Sri Bhagavatam – Lord Rama’s incarnation ends
ఒక రోజున రాముడి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు .. ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించడానికి వచ్చానని చెబుతాడు. దాంతో రాముడు ఆయనను ఒక ప్రత్యేక మందిరానికి తీసుకెళతాడు. తాము మాట్లాడుకునే సమయంలో ఎవరు వచ్చినా, వాళ్లను రాముడు కడతేర్చవలసి ఉంటుందని చెబుతాడు. అందుకు అంగీకరించిన రాముడు .. ఎవరూ అటువైపు రాకుండా ద్వారం దగ్గర లక్ష్మణుడిని కాపలాగా ఉంచుతాడు.
ఆ వ్యక్తి తాను యమధర్మరాజునని రాముడితో చెబుతాడు .. రామావతారాన్ని చాలించవలసిన సమయం ఆసన్నమైనదనే విషయాన్ని బ్రహ్మదేవుడు గుర్తుచేయమన్నాడని అంటాడు. రామవతారంలో తాను అనుకున్న పనులను పూర్తి చేసినట్టుగా రాముడు చెబుతాడు. ఆయన మాటల్లోని అర్థాన్ని యమధర్మరాజు గ్రహిస్తాడు. అంతలో దుర్వాసుడు అత్యవసరంగా కలవాలంటూ తొందర చేస్తున్నాడని చెబుతూ లక్ష్మణుడు అక్కడికి వస్తాడు. తమ్ముడి విషయంలోను ఆడిన మాటలు తప్పకూడదని చెప్పి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తన విషయంలో ఆడిన మాటలు తప్పవద్దని లక్ష్మణుడు .. రాముడితో అంటాడు. ఏం చేయాలని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు రాముడు. ఇకపై లక్ష్మణుడిని వదిలేయమనీ .. అది ఆతనిని అంతమొందించిన పనితో సమానమని వశిష్ఠుడు అంటాడు. అందుకు రాముడు అంగీకరిస్తాడు. తన అన్న తనతో సంబంధాన్ని తెంచుకున్న తరువాత, తాను బ్రతకడంలో అర్థం లేదని భావించిన లక్ష్మణుడు, సరయూ నదిలో దేహ త్యాగం చేస్తాడు.
లక్ష్మణుడు దేహత్యాగం చేశాడని తెలిసి రాముడు బాధతో తల్లడిల్లిపోతాడు. ఆ తరువత ఆయన లవకుశులకు సింహాసన బాధ్యతలను అప్పగిస్తాడు. వశిష్ఠాది మహర్షుల దగ్గర సెలవు తీసుకుని సరయూ నది తీరానికి చేరుకుంటాడు. సరయూ నదిలో దేహత్యాగం చేసి .. వైకుంఠానికి చేరుకుంటాడు. రాముడు లేని అయోధ్యను తాము చూడలేమనీ, తాము అక్కడ ఉండలేమని ఎంతోమంది ప్రజలు కూడా సరయూ నదిలో శరీర త్యాగం చేస్తారు. అలా ధర్మస్వరూపుడైన రాముడి అవతార పరిసమాప్తి జరుగుతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Lord Rama’s incarnation ends