Sri Bhagavatam – Bali Chakravarthi Conquers Amaravathi

బలిచక్రవర్తి తన దివ్యరథంపై అమరావతికి యుద్ధానికి బయల్దేరతాడు. అమృతం లభించడానికి ముందు దేవతలు తన దగ్గర వినయం ప్రదర్శిస్తూ వచ్చారు. అమృతం కోసం తన సాయం అర్ధించారు. సాయం చేసిన తమని మోసం చేశారు. తాము అమరులమని మిడిసిపడుతున్నారు. దానవులను బానిసలుగా చూస్తున్నారు. అందువలన వాళ్లకి తగిన విధంగా బుద్ధి చెప్పవలసిందే అనుకుంటూ అమరావతిలో అడుగుపెడతాడు. అమరావతిలో ఎవరూ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతాడు.

అమృతం సేవించిన దేవతలు దారిలోనే తనని ఎదుర్కొంటారని తాను భావిస్తే, దేవేంద్రుడి సభాభవనం వరకూ వచ్చిన తనని అడ్డుకునే నాథుడు కనిపించకపోవడంతో ఆయన నిరాశపడతాడు. అమృతం తాగినా దేవతలలో పిరికితనం మాత్రం పోలేదని నవ్వుకుంటాడు. ఇంద్రాది దేవతలు ఎక్కడ ఉన్నా తన మాట వినిపించుకోవాలని గట్టిగ అరుస్తాడు. ఇకపై అమరావతి తనదీ .. తన అధినంలోనే ఉంటుంది. ఇక్కడ అడుపెట్టాలంటే తన అనుమతి కావాలి. అధికారం కావాలంటే తనని యుద్ధంలో జయించాలని హెచ్చరిస్తాడు.

అలా అమరావతిని తన సొంతం చేసుకున్న బలిచక్రవర్తి, విజయగర్వంతో తన నగరానికి చేరుకుంటాడు. ఎప్పటిలానే తన ప్రజలకు ఎలాంటి లోటు రానీయకుడా పరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఇంద్రాది దేవతలు భూలోకంలోని అడవుల్లో తలదాచుకుంటారు. తమ ఆచూకి బలిచక్రవర్తికి తెలియకుండా జాగ్రత్తపడుతూ భయం భయంగా బ్రతుకుతుంటారు. స్వర్గ సుఖాలను అనుభవించిన అమరులు అడవుల్లో నానా బాధలు పడుతుంటారు. బలిచక్రవర్తిని ఓడించడం జరగని పని .. ఇక తమ నివాసం ఎప్పటికీ అడవినే అని నిరాశ చందుతుంటారు.

అమరలోకంలో సింహాసనంపై కూర్చుని ఆదేశాలు జారీ చేసే దేవేంద్రుడు ఎలాంటి పని లేకుండా అడవులలో తిరుగుతుండటం చూసి, శచీదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పారిజాత వృక్షాల నీడలో విహరిస్తూ .. పట్టుపాన్పులపై శయనించే శచీదేవి కటికనేలపై శయనిస్తూ ఉండటం ఇంద్రుడికి బాధను కలిగిస్తుంది. ఇలా ఎంతకాలం? అన్నట్టుగా ఇతర దేవతలు నిరాశ నిస్పృహలను వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.