Sri Bhagavatam – Destruction of Yadavs

యాదవులు పరస్పరం కలహించుకోవడం మొదలవుతుంది .. ఎలాంటి కారణాలు లేకుండానే వాళ్లంతా గొడవలు పడుతుంటారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రదేశమంతా ఒక యుద్ధభూమిలా మారిపోతుంది. ఒకరిని ఒకరు హతమార్చుకుంటూ ఉంటారు. చూస్తుండగానే ఆ ప్రదేశమంతా శవాల దిబ్బలా తయారవుతుంది. యాదవులంతా నశిస్తూ ఉంటారు. తాము ఏం చేస్తున్నామనే స్పృహలో లేకుండానే కుప్పకూలిపోతుంటారు.

ద్వారకలో ప్రజల హాహాకారాలు కృషుడికి వినిపిస్తూ ఉంటాయి. జంతువుల అరుపులతో ఆ ప్రాంతమంతా ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా కోలాహలమే .. ఎవరు ఎక్కడికి వెళుతున్నారో .. ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఎవరూ కూడా ఆ తొక్కిసలాటకి దూరంగా వెళ్లాలనే ప్రయత్నం చేయకుండా ఆ గుంపులోనే చొరబడుతుంటారు. ఎవరికివారు అంతకుముందు తమ మధ్య గల సాన్నిహిత్యాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు.

గాంధారి శాపం .. మునుల శాపం ఫలించడానికి మరెంతో సమయం లేదనే విషయం కృష్ణుడికి తెలిసిపోతుంది. జరగనున్నది ముందుగానే తెలిసి ఉండటం వలన, ఆ తరువాత తాను నిర్వహించవలసిన విధిని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. దూరంగా యాదవుల అరుపులు .. కేకలు వినిపిస్తూనే ఉంటాయి. సముద్ర తీరంలో శవాలు గుట్టలుగా పడుతూ ఉంటాయి. చూస్తుండగానే యాదవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది.

సముద్రం హోరు పెరుగుతుంది .. కెరటాల ఉధృతి పెరుగుతుంది. ప్రకృతి అంతా కూడా కళా విహీనమై కనిపిస్తూ ఉంటుంది. ఇష్టానుసారంగా యాదవులు పడిన గొడవల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతారు. మిగిలిన కొంతమంది కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దాదాపు యాదవులంతా నేలకి ఒరగడం వలన, వాతావరణంలో ఒక నిశ్శబ్దత చోటుచేసుకుంటుంది. అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి బయాల్దేరతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Destruction of Yadavs