Sri Bhagavatam – Hanuman’s warning to Ravana
రావణుడు .. హనుమంతుడిని పరిశీలనగా చూస్తాడు. ఎవరు నువ్వు .. ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు లంకానగరంలోని వనాలను ధ్వంసం చేస్తున్నావు? అని అడుగుతాడు. తాను శ్రీరాముడు పంపించగా వచ్చిన దూతననీ .. సీతమ్మతల్లిని మర్యాదగా రాముడికి అప్పగించమని చెప్పడం కోసమే వచ్చానని హనుమంతుడు అంటాడు. రాముడు సాధారణ మానవుడు కాదనీ, ఆయన పరాక్రమాన్ని గురించి తెలియక తప్పు చేసి ఉంటావని చెబుతాడు. రాముడికి క్షమాపణ చెప్పి .. సీతను అప్పగించడం మంచిదని హితవు పలుకుతాడు.
తన గొప్పతనం గురించి తెలియక .. కేవలం రాముడు మాత్రమే గొప్పవాడని అతను అనుకుంటున్నట్టుగా తనకి అర్థమైందని రావణుడు అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో సీతను వదిలేది లేదని రావణుడు తేల్చి చెబుతాడు. ఈ విషయంలో విభీషణుడు మంచి చెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినిపించుకోడు. పైగా హనుమ తోకకు నిప్పు అంటించి, అతని అహంభావాన్ని అణచమని పరివారాన్ని ఆదేశిస్తాడు. దాంతో వాళ్లంతా హనుమను పట్టుకుని ఆయన తోకకు నిప్పు అంటిస్తారు.
దాంతో హనుమంతుడు నిప్పు అంటిన తోకతో భవంతులపై పాకడం .. ఎక్కడం .. దూకడం చేస్తాడు. అంతే .. చూస్తుండగానే లంకానగరంలోని భవంతులు .. వనాలు తగలబడిపోతుంటాయి. రాక్షసులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తుండటం చూసి నవ్వుకుంటూ హనుమ తిరిగి బయల్దేరతాడు. అలా అతను సముద్రం ఇవతల తీరానికి చేరుకుని, జాంబవంతుడితో కూడిన తన సమూహాన్ని కలుసుకుంటాడు. సీతమ్మను చూసిన విషయాన్ని వాళ్లతో చెబుతాడు. అందరూ కలిసి అక్కడి నుంచి కిష్కింధకు బయల్దేరతారు.
హనుమ .. రాముడి దగ్గరికి వస్తూనే “చూసితిని సీతను” అంటూ రాముడికి ఆనందాన్ని కలిగిస్తాడు. ఆ తరువాత లంకానగరంలో జరిగినదంతా వివరిస్తాడు. సీతాదేవి ఇచ్చిన “చూడామణి”ని రాముడికి అందజేస్తాడు. అది చూస్తూ రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. రావణుడిపై యుద్ధం చేసి గెలిచి సీతాదేవిని తీసుకురావడమే తప్ప, మరో మార్ర్గం లేదని హనుమంతుడు చెబుతాడు. దయతో రావణుడి పైకి యుద్ధానికి వెళ్లవలసిన ముహూర్తాన్ని రాముడు ఖరారు చేస్తాడు. ఓ శుభ ముహూర్తాన వానర వీరులతో కలిసి రామలక్ష్మణులు బయల్దేరతారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Hanuman’s warning to Ravana