Ramayanam – 7 : Ahalya freed from curse

మిథిలా నగరం దిశగా విశ్వామిత్రుడు నడుస్తుంటాడు, రామలక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు. అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది. రాముడి పాద స్పర్శ తాకగానే ఆ బండరాయి ఒక స్త్రీ మూర్తిగా మారిపోతుంది. ఆ స్త్రీ మూర్తి రాముడికి వినయంగా నమస్కరిస్తుంది. ఆయన పాదస్పర్శ వలన తనకి శాపవిమోచనమైందని కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ స్త్రీ పేరే “అహల్య”, ఆమె గౌతమ మహర్షి ఇల్లాలు. ఆమె అలా బండరాయిగా పడి ఉండటానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది.

గౌతమ మహర్షి – ఆయన భార్య అహల్య ఆశ్రమజీవితం గడుపుతూ ఉంటారు. అహల్య మహా సౌందర్యరాశి, అనునిత్యం భర్త పూజకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుతూ ఉంటుంది. ఒకసారి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న ఇంద్రుడు ఆమెను చూస్తాడు. ఆమె సౌందర్యం ఆయనను సమ్మోహితుడిని చేస్తుంది. దాంతో ఆమె పట్ల ఆయనకి వ్యామోహం పెరుగుతుంది. ఆమెను లోబరుచుకునే అవకాశం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాడు. ప్రతిరోజూ తెల్లవారు జామునే గౌతమ మహర్షి స్నానానికై నదికి వెళ్లడం గమనిస్తాడు.

ఓ రాత్రివేళ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్న ఇంద్రుడు, కోడిలా మారిపోయి కోడిలానే కూస్తాడు. తెల్లవారిపోయిందనుకున్న గౌతముడు, నదికి బయల్దేరతాడు. ఆయన అలా వెళ్లగానే ఆయన రూపంలో ఆశ్రమంలోకి ఇంద్రుడు ప్రవేశిస్తాడు. అహల్యపట్ల వ్యామోహంతో ఉన్న ఇంద్రుడు ఆమెను స్పర్శిస్తాడు. గౌతముడు నదీ స్నానానికి వెళ్లడం చూడని కారణంగా, తన శయ్యపై కూర్చున్నది తన భర్తేనని అనుకుంటుంది. తన భర్త రూపంలో వచ్చింది ఇంద్రుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది. నదీ స్నానం కోసం బయల్దేరి కొంతదూరం వెళ్లిన గౌతముడికి, ఇంకా తెల్లవారలేదనే విషయం అర్థమవుతుంది. ఆ సమయంలో కోడి ఎందుకు కూసి ఉంటుందనే విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూనే ఆశ్రమానికి చేరుకుంటాడు.

ఆశ్రమంలో తన రూపంలోని దేవేంద్రుడితో అహల్యను చూస్తాడు. ఇంద్రుడి ధోరణి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. అతని శరీరం అంతటా కూడా సహస్ర యోనులు చోటుచేసుకుంటాయని శపిస్తాడు. వచ్చినవాడు తన భర్త కాదు అనే విషయాన్ని గ్రహించలేకపోయిన అహల్య, శిలగా పడి ఉండాలని శపిస్తాడు. ఆ ఇద్దరూ ప్రాధేయపడటంతో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువైన చోటున వాళ్లను పూజించి శాపవిమోచనాన్ని పొందమని ఇంద్రుడికి చెబుతాడు. శ్రీరాముడి పాద స్పర్శచేత శాపవిమోచనం కలుగుతుందని అహల్యతో అంటాడు. అలా రాముడి పాదం సోకిన వెంటనే అహల్యకు శాపవిమోచనం అవుతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 7 : Ahalya freed from curse

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: