Ramayanam – 45 : Rama angry on Sea God Samdrudu

సముద్ర తీరానికి చేరుకున్న రాముడికి అవతలి ఒడ్డుకు ఎలా చేరుకోవాలనేది అర్థం కాదు. అందుకు తగిన ఉపాయమును ఆలోచించమని చెప్పి, ఆయన కూడా ఆలోచనలో పడతాడు. సముద్రుడికి వినయంగా నమస్కరించిన రాముడు, తాను బయల్దేరిన విషయాన్ని గురించి వివరిస్తాడు. వానర సేనలతో కలిసి సముద్రాన్ని దాటవలసి ఉందనీ, అందుకు దారీయమని కోరతాడు. సముద్రుడు కరుణించి దారి ఇస్తాడనే ఉద్దేశంతో రామలక్ష్మణులు, వానరులు ఎదురుచూస్తూ ఉంటారు. సముద్రం ఎప్పటిమాదిరిగానే హోరు పెడుతూ ఉంటుంది. కెరటాలతో సయ్యాటలాడుకుంటూనే ఉంటుంది.

తాను దారి అడిగితే ఇవ్వకపోగా తగిన సమాధానం కూడా సముద్రుడి నుంచి రాకపోవడం పట్ల రాముడు కోపిస్తాడు. తన దివ్యాస్త్రాలను ప్రయోగించి సముద్రాన్ని ఇంకింపజేస్తానని విల్లును అందుకుంటాడు. లక్ష్మణుడు నచ్చజెబుతూ ఉండగా, వాళ్ల ఎదుట సముద్రుడు నిలుస్తాడు. రాముడికి వినయంగా నమస్కరించి, శాంతించమని కోరతాడు. కెరటాలతో ఎగసి పడటం తన లక్షణమని చెబుతాడు. అందువలన తాను దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తే, అనేక సముద్ర జీవరాసులు నశిస్తాయని అంటాడు. అయితే సముద్రాన్ని దాటే మార్గమే లేదా అని లక్ష్మణుడు అడుగుతాడు.

సముద్ర తీరంలో కెరటాల తీవ్రత తక్కువగా ఉన్న మార్గాన్ని తాను చూపుతాననీ, ఆ మార్గంలో వంతెన నిర్మించుకుని అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చునని సముద్రుడు చెబుతాడు. ఆయన మాటల పట్ల రాముడు సంతృప్తిని వ్యక్తం చేస్తాడు. సముద్రుడు ఒక మార్గాన్ని చూపించి వాళ్లు అవతల తీరానికి చేరుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదని చెబుతాడు. రామలక్ష్మణులు నమస్కరించడంతో సముద్రుడు తిరిగి ఆ జలాలలో కలిసిపోతాడు. వానర వీరులలో ఒకరైన నలుడు వంతెన నిర్మాణంలో మంచి నైపుణ్యం కలిగినవాడు. అందువలన ఆ బాధ్యతను రాముడు అతనికి అప్పగిస్తాడు.

రాముడి ఆదేశం మేరకు నలుడు ఆ క్షణమే రంగంలోకి దిగుతాడు. ఇతర వానర వీరుల సహాయ సహకారాలతో తనకి కావలసినవి ఏర్పాటు చేయించుకుంటూ ఉంటాడు. వానరాలలో మహా బలవంతులైనవారు వంతెన నిర్మాణానికి అవసరమైన పెద్ద పెద్ద బండరాళ్లను, వృక్షాలను తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటారు. రాముడి చేతి స్పర్శ కారణంగా సముద్రంలో వేసిన బండరాళ్లు తేలుతూ ఉంటాయి. ఆ రాళ్లు చెదిరిపోకుండా నలుడు తన పనితనం చూపుతుంటాడు. అలా సముద్రంపై వారథి నిర్మాణానికి అవసరమైన పనులు జరుగుతూ ఉండగా విభీషణుడు అక్కడికి వస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 45 : Rama angry on Sea God Samdrudu

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: