Sri Bhagavatam – Sita arrives at Valmiki ashram
అడవులలో ఒంటరిగా వదిలివేయబడిన సీతాదేవి, వాల్మీకి మహర్షి కంటపడుతుంది. గర్భవతిగా ఉన్న సీతాదేవిని తన ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. “లోక పావని” పేరుతో ఆశ్రమవాసులకు పరిచయం చేస్తాడు. ఆమెను కంటికి రెప్పలా చూసుకోమని ఆశ్రమవాసులతో చెబుతాడు. ఆశ్రమంలో నిరంతరం రామ నామం మోగుతుండటంతో, సీతాదేవి మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. అక్కడ ఆమె లవ కుశులకు జన్మనిస్తుంది.
వాల్మీకి ఆశ్రమ వాతావరణంలో లవకుశులు పెరుగుతారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆశ్రమంలో రామనామ స్మరణ వినిపించడం .. వాల్మీకి మహర్షి రామాయణ కథను గానం చేయడంతో, వాళ్లకి రాముడిపై అపారమైన అభిమానం కలుగుతుంది. దాంతో ఊరూరా తిరుగుతూ రామకథను గానం చేయడం మొదలుపెడతారు. ఈ విషయం తెలిసి పిల్లలను కౌసల్యదేవి తమ అంతఃపురానికి పిలిపిస్తుంది. అక్కడ వాళ్లు రామకథను గానం చేస్తారు. రాముడు వాళ్లను అక్కున చేర్చుకుని అభినందిస్తాడు.
రాముడు నిరంతరం సీతాదేవిని గురించిన ఆలోచన చేస్తుంటాడు. రాజ్యంలో కరువుకాటకాలు ఏర్పడతాయి. మహర్షుల ఆదేశం మేరకు రాముడు “అశ్వమేధ యాగం” చేయడానికి అంగీకరిస్తాడు. భార్యా సమేతుడై యాగం చేయాలంటే, “బంగారు సీత” ప్రతిమను చేయించి, ఆ యాగాన్ని ఆరంభిస్తాడు. యాగాశ్వాన్ని వదులుతారు … దానిని అనుసరిస్తూ శత్రుఘ్నుడు సైన్యంతో వెళతాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమం దిశగా వెళ్లిన ఆ యాగాశ్వాన్ని లవకుశులు బంధిస్తారు.
యాగాశ్వాన్ని విడిపించడానికి శత్రుఘ్నుడు చేసిన ప్రయత్నం విఫలమవుతుంది. ఆ వెనుకనే వచ్చిన భరతుడు కూడా లవకుశులు ధాటికి తట్టుకోలేకపోతాడు. దాంతో రాముడే స్వయంగా రంగంలోకి దిగవలసి వస్తుంది. గతంలో తన మందిరంలో రామాయణ కథాగానం చేసిన పిల్లలే యాగాశ్వాన్ని బంధించడం చూసినా రాముడు, వాళ్లపై ఆగ్రహించలేకపోతాడు. యాగాశ్వన్ని అలా బంధించకూడదనీ .. దానిని వదిలివేయమని అనేక రకాలుగా నచ్చజెబుతాడు. అయినా వాళ్లు వినిపించుకోకపోవడంతో తీవ్రమైన అసహనానికి లోనవుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Sita arrives at Valmiki ashram