Today rashi phalalu – 05 మార్చి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


మిత్రులతో విభేదాలు తప్పవు. పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం అంతంత మాత్రమే.. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు . పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం కష్టమే. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు . అనుకూల రంగులు……గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు.. పసుపు. హనుమాన్చాలీసా పఠించాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. శ్రమకు ఫలితం దక్కుతుంది.. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు…కాఫీ, బంగారు. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. మీ నిర్ణయాలు నచ్చక కొందరు సన్నిహితులు దూరమవుతారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగులు విధుల్లో మార్పులు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అనుకూల రంగులు…..పసుపు,గులాబీ. ప్రతికూల రంగు.. గోధుమ, అంగారక స్తోత్రం పఠించాలి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు , ఆభరణాలు కొంటారు. వివాహయత్నాలు ఫలిస్తాయి.. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం. విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు కుటుంబసభ్యుల నుంచి సహాయం అందుకుంటారు.. అనుకూల రంగులు……పసుపు,కాఫీ. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించాలి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


వ్యవహారాల్లో ఆటంకాలు. బంధువులతో కలహాలు. పనులు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రత్యర్థులు సమస్యలు సృష్టించవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకూల రంగులు……గోధుమ, గులాబీ. ప్రతికూల రంగు.. పసుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. అందరిలోనూ మీదే పై చేయిగా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారతారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. అనుకూల రంగులు……ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు.. గోధుమ, శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాల పై ఆసక్తి. విందువినోదాలలో పాల్గొంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు, ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఉత్సాహవంతమైనకాలం. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు……నలుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. శారీరక రుగ్మతలు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ఒత్తిడులు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు కుటుంబంలో చిక్కులు. అనుకూల రంగులు……తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు.. పసుపు. గణపతికి అర్చనలు చేయించుకోవాలి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని సంఘటనలు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. శారీరక∙రుగ్మతలు బాధిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు. మహిళలకు మానసిక ఆందోళన.. అనుకూల రంగులు……కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు.. గోధుమ, శివాలయ దర్శనం చేసుకోండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి., ఆలోచనలు అమలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు.. ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని సన్మానాలు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు.. తెలుపు. హనుమాన్చాలీసా పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూములు, గృహం కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులు మరింతగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.. రాజకీయ, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల రంగులు……బంగారు, పసుపు. ప్రతికూల రంగు.. గోధుమ, వేంకటేశ్వరస్వామిని పూజించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి. పనుల్లో ప్రతిబంధకాలతో ఇబ్బంది పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా మెలగండి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ఉద్యోగాల్లో అదనపు పని భారం. వ్యాపారులు నూతన పెట్టుబడుల్లో తొందరపడరాదు. రాజకీయ, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలురద్దు కాగలవు. విద్యార్థులకు అంచనాలు తప్పి నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు……నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు. పసుపు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: