Today rashi phalalu – 06 మార్చి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోని ఖర్చులతో సతమతమవుతారు. కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య కలహాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులపై ఆచితూచి ముందడుగు వేయాలి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. చిత్రరంగ పరిశ్రమ వారు, వైద్యులలో పట్టుదల పెంచుకుంటే మంచిది. విద్యార్థులకు ఏ మాత్రం తొందర వద్దు. మహిళలకు నిరాశ తప్పదు. అదృష్ట రంగులు……. ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…పసుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు చికాకులు, సమస్యలు తప్పవు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత నిదానం పాటించాలి. మహిళలకు మానసికంగా కొంత ఆందోళన . అదృష్ట రంగులు……. బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. నరసింహ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. దేవాలయాలు, ధార్మిక కేంద్రాల సందర్శనం. కుటుంబంలో వేడుకలు హుషారుగా నిర్వహిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొద్దిపాటి సమస్యలు తీరతాయి. ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యత అయినా వేగంగా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు నైపుణ్యతను చాటుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి వివాదాలు తొలగుతాయి. అదృష్ట రంగులు……. కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. గణపతిని పూజించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కార్యక్రమాలలో అనుకోకుండా ఏర్పడిన ఆటంకాలు నిరాశ కలిగిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడండి. దూరపు బంధువులతో తగాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు కుదిస్తారు. ఉద్యోగ మార్పులు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులు తృటిలో కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు. అదృష్ట రంగులు……. కాఫీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. గణపతిని పూజించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ముఖ్యమైన కార్యక్రమాలను సమయానుసారం పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు మీకు ఇతోధిక సాయం అందిస్తారు. ఒక వ్యక్తి ద్వారా కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆదాయం మరింత ఉత్సాహం ఇస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టిన పెట్టుబడులపై సంతృప్తి చెందుతారు. ఉద్యోగులు విధులలో తీసుకున్న జాగ్రత్తలు ఉపయుక్తంగా ఉంటాయి. వైద్యులు, క్రీడాకారులకు ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు మేథస్సును చాటుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అదృష్ట రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…తెలుపు. కనకదుర్గాదేవిని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలపై అనుమానాలు. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. విద్యార్థులు శ్రమకోర్చి ముందుకు సాగాలి. మహిళలకు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అదృష్ట రంగులు……. నీలం, నలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. అన్నపూర్ణాష్టకం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. కీలకమైన విషయాలు తెలుస్తాయి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు అనూహ్యంగా చేపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆశించిన మేర లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు శక్తిని మంచి విధులు పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలు, రచయితలకు శుభవార్తలు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు. అదృష్ట రంగులు……. బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…నీలం. విష్ణు ధ్యానం చేయండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

బంధువులతో కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, నగలు కొంటారు. ఆత్మీయలు నుంచి పిలుపు అందుకుని ప్రయాణాలు సాగిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఊహించని రీతిలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ఆశాజనకంగా ఉంటుంది. క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారిపై ఆరోపణలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. అదృష్ట రంగులు……. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. స్నేహితులతో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. కాంట్రాక్టర్లకు కొన్ని చిక్కులు. ఎటూతేల్చుకోలేరు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అదృష్ట రంగులు……. తెలుపు, లేత నీలం. ప్రతికూల రంగు…పసుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి విషయాలలో సోదరులతో మాటపట్టింపులు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు. దైవకార్యాలలో పాల్గొంటారు. ఒక ఆప్తుని ద్వారా అందిన సమాచారంతో డీలాపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీల నిర్వహణలో పొరపాట్లు దొర్లి ఇబ్బందిపడతారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. విద్యార్థుల పై ఒత్తిడులు రావచ్చు. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అదృష్ట రంగులు……. గులాబీ, నీలం. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


యత్నకార్యసిద్ధి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన కలుగుతుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న రాబడి చేకూరుతుంది. ఉద్యోగులు విధుల్లో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఎనలేని సంతోషంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, వైద్యులకు ఊహించనంత గౌరవం లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ముమ్మరం కాగలవు. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అదృష్ట రంగులు……. గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూలరంగు…బంగారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అనుకోని ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, నగలు సమకూరతాయి. మీపట్ల ద్వేషం కలిగిన వారిని సైతం ఆకట్టుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారిపై ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు మనశ్శాంతి చేకూరుతుంది. మహిళలకు కుటుంబంలోని అంతా ప్రశంసిస్తారు. అదృష్ట రంగులు…….గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణపతిని పూజించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: