Today rashi phalalu – 07 మార్చి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
వ్యవహారాల్లో అవాంతరాలు. రాబడికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. బాధ్యతలతో సతమతమవుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. రాజకీయ, పారిశ్రామివేత్తలకు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు మరింత నిదానంగా వ్యవహరించాలి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… తెలుపు, ఎరుపు. ప్రతికూల రంగు…నలుపు. గణపతిని పూజించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కుటుంబంలో చికాకులు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు కొంత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం మందగించి ఇబ్బందిపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు దక్కడం కష్టమే.. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలపై నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు… తెలుపు. ఆదిత్య హృదయం పఠించాలి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.. ప్రముఖుల సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయం మీ ఆశలకు తగినట్లుగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు మరింత ఆర్జిస్తారు. ఉద్యోగులకు మరింత అనుకూల పరిస్థితి. చిత్రపరిశ్రమ వారు, రాజకీయవేత్తలకు ఊహించని శుభవార్తలు. విద్యార్థులు మరింత ఆనందంగా గడుపుతారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…… గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
రుణ దాతలు ఒత్తిడులు పెంచుతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. కార్యక్రమాలు కొన్ని వాయిదా. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు భాగస్వాముల ద్వారా ఒత్తిడులు. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు సమస్యలు తప్పవు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
అనుకున్న కార్యక్రమాలను సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు చికాకులు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు…… గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…నీలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆశించిన ఆదాయం రాక అప్పుల కోసం యత్నిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ద్వారా సమస్యలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ప్రోత్సాహం అంతగా కనిపించదు. విద్యార్థులకు ఎంత కష్టించినా ఫలితం రాదు. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు…… ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం మరింత ఉత్సాహాన్నిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మీద వేసుకుంటారు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
సమాజంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం సమకూరుతుంది. ఆర్థిక పరిస్థితిని కొంత మెరుగుపర్చుకుంటారు. కార్యక్రమాలు అనుకున్నరీతిలో సాగుతాయి. వ్యతిరేకులు కూడా మీపట్ల సానుకూల వైఖరి అనుసరిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఒక సంతోషదాయక సమాచారం. ఉద్యోగులకు విధి నిర్వహణ అనుకూలిస్తుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సమస్యలు, వివాదాల నుండి విముక్తి. విద్యార్థులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు…… నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…బంగారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు విధులు గందరగోళంగా మారతాయి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు లేనిపోని సమస్యలు. విద్యార్థులు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు చికాకులు తప్పవు. అనుకూల రంగులు…… గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు మందకొడిగా కొనసాగుతాయి. భార్యాభర్తల మధ్య సమన్వయం కొరవడుతుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే. ఉద్యోగులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు కొంత అయోమయంగా ఉంటుంది. మహిళలు నిర్ణయాలలో తొందరపడరాదు. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. రాబడి మరింత పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో విశేష ప్రతిభ చూపుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు… ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు…గోధుమ. గణపతిని ఆరాధించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనల పై ఒక నిర్ణయానికి వస్తారు. ఆదాయం మరింత సంతోషాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు మీ చేయూతనిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్ని విధాలా లాభదాయకమే. ఉద్యోగులకు సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు…… గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com