Today rashi phalalu – 12 మార్చి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. భూ, వాహనయోగాలు. మాటల చతురతతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు విశేష ఆదరణ. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు తగినంత గుర్తింపు రాగలదు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూలం… గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూలం….నీలం. ఈశ్వరస్తుతి మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
నూతన ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సన్నిహితుల సాయం అందతుంది. కార్యజయం. భూలాభాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు సోదరుల నుంచి పిలుపు రావచ్చు. అనుకూలం… లేత గులాబీ, తెలుపు.ప్రతికూలం… నేరేడు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులు, ఇంటాబయటా బాధ్యతలు. ఇంటాబయటా చికాకులు, సమస్యలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో కలహాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణమైన పరిస్థితి. ఉద్యోగులకు ఒత్తిడులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొన్ని చికాకులు. విద్యార్థుల శ్రమ ఫలించదు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూలం… ఎరుపు, లేత పసుపు.ప్రతికూలం….గులాబీ. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు. కార్యక్రమాలు ముందుకు సాగక డీలాపడతారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబంలో సమస్యలు. బంధువుల నుంచి లేనిపోని వివాదాలు. ప్రతి విషయంలోనూ నిదానం అవసరం. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో అదనపు పనిభారం. రాజకీయవేత్తలు, వైద్యులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమపడాలి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూలం… ఎరుపు, లేత ఆకుపచ్చ,ప్రతికూలం….తెలుపు. దేవీఖడ్గమాల పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్ని శుభసూచనలే. ఉద్యోగులకు విధులు సజావుగా సాగుతాయి. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు ఆస్తిలాభం. అనుకూలం… గులాబీ, లేత పసుపు.ప్రతికూలం….నీలం. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
రుణబాధలు తప్పవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో అకారణ వైరం. ముఖ్యమైన చర్చలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలతో నలుగుతారు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశ మిగులుతుంది. ఉద్యోగులకు పనిభారం. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు కొత్త ఇబ్బందులు. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ. మహిళలకు మానసిక అశాంతి. అనుకూలం… నీలం, నేరేడు.ప్రతికూలం….ఆకుపచ్చ. విష్ణుధ్యానం చేయండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విలువైన వస్తువులుకొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అంచనాలలో పొరపాట్లు తొలగుతాయి. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. వైద్యులు, క్రీడాకారులకు పురస్కారాలు. విద్యార్థులకు సమస్యలు తీరతాయి. మహిళలకు అంచనాలు తప్పుతాయి. అనుకూలం… ఎరుపు, నేరేడు,ప్రతికూలం….తెలుపు. శివాష్టకం పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. మీ నిర్ణయాలపై అందరూ వ్యతిరేకత చూపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు శ్రమ పడతారు, అయితే లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలు కొన్ని తిరస్కరిస్తారు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూలం… ఆకుపచ్చ, తెలుపు.ప్రతికూలం… నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వాహనయోగం. ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూలం… గులాబీ, లేత ఎరుపు.ప్రతికూలం….ఆకుపచ్చ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
మీ శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు భాగస్వాముల నుండి ప్రోత్సాహం. ఉద్యోగులకు అనుకూలం. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు అన్ని విధాలా ప్రోత్సాహం. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. అనుకూలం… పసుపు, లేత ఆకుపచ్చ,ప్రతికూలం….గులాబీ. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
రుణయత్నాలు సాగిస్తారు. బంధుమిత్రులతో వైరం. ప్రముఖులతో సంభాషిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు మరింతగా పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొంత రాజీమార్గం తప్పదు. విద్యార్థులకు ఫలితాలపై నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూలం… నలుపు, నేరేడు,ప్రతికూలం….పసుపు. అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణ పరిస్థితి. ఉద్యోగులకు విధులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. అనుకూలం…నీలం, లేత పసుపు, ప్రతికూలం….కాఫీ. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com