Today rashi phalalu – 13 మార్చి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొన్ని అవసరాల నిమిత్తం కొత్త యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఇంటాబయటా వివాదాలు రావచ్చు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువులతో విరోధాలు నెలకొంటాయి. వాహన చోదకులు అప్రమత్తంగా మెలగాలి. కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు, చికాకులు. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు ఎంతో కష్టపడతారు..ఫలితం నామమాత్రమే. మహిళలకు సమస్యలు ఎదురవుతాయి. అనుకూల రంగులు…….. ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…కాఫీ. గణేశ స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కొత్త పరిచయాలు. అదనపు రాబడితో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఎటువంటి కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. దూర ప్రాంతాల నుంచి అతి ముఖ్య సమాచారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విశేష లాభదాయకం. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాల కోసం యత్నిస్తారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…గోధుమ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభసూచకాలే. ఉద్యోగాల్లో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు వివాదాలు సద్దుకుంటాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలు అందుకుంటారు. మహిళలకు పుట్టింటి నుండి లబ్ధి చేకూరవచ్చు. అనుకూల రంగులు…….. పసుపు, లేత గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. పంచముఖ ఆంజనేయుని పూజించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కుటుంబ సమస్యలు కొంత ఆందోళనకలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో అకారణ వైరం. ఆరోగ్యం∙చికాకు పరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు అందిన అవకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…….. గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


రుణ బాధలు తప్పవు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు సంభవం. స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార విహారాదులపై శ్రద్ధ చూపండి. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వివాదాలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత గందరగోళం. మహిళలు మనోవేదనకు గురవుతారు. అనుకూల రంగులు…….. నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. నృసింహ స్తోత్రాలు పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కుటుంబంలో చికాకులు తొలగే సమయం. ఆలోచనలు కలసి వస్తాయి. బంధువులతో తగాదాలు తీరతాయి. ఆభరణాలు, వాహనాలు కొంటారు. ధార్మిక, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఊహించని ప్రగతి తథ్యం. ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి కొన్ని అవార్డులు వచ్చే వీలుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు…….. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నలుపు. శివ స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


రాబడి తగ్గి నిరాశ చెందుతారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్య సమస్యలతో సతమతం కాగలరు. మిత్రులతో తగాదాలు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. దేవాలయాల సందర్శనం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని వివాదాలు రావచ్చు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, వైద్యులకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. విద్యార్థులు ఆశించిన అవకాశాలను పోగొట్టుకుంటారు. మహిళలకు అనారోగ్యం, ఔషధ సేవనం. అనుకూల రంగులు…….. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నవగ్రహాల స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

నూతన ఉద్యోగాలలో చేరతారు. కార్యక్రమాలలో విజయం. ఇంత కాలం స్దబ్ధుగా ఉన్న మీరు ఒక్కసారిగా హుషారుగా మారడం విశేషం. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి ఇబ్బందులు లేకుండానే గడుస్తుంది. నిర్ణయాలలో మీ మనస్సునే నమ్ముకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి ఆహ్వానాలు. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంతో సాగుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. అనుకూల రంగులు…….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. కనకధారా స్తోత్రం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కార్యక్రమాలలో ఆటంకాలు. కుటుంబ సభ్యులతో విభేదాలు. కాంట్రాక్టులు కొంత గందరగోళంగా మారతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించడం మంచిది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ఇబ్బందికరంగా మారవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొత్త చిక్కులు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…….. నీలం, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ప్రముఖులతో పరిచయాలు. కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. సమాజసేవలో మీ వంతు పాత్ర పోషిస్తారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలపై సంతృప్తి చెందుతారు. ఉద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారిలో పట్టుదల పెరుగుతుంది. విద్యార్థులు సంతోషకరంగా గడుపుతారు. మహిళలకు బంధువుల సహాయం లభిస్తుంది. అనుకూల రంగులు…….. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు.. తెలుపు. దత్తాత్రేయుని పూజించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, ఆభరణాలు కొంటారు. రాబడి పై కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ కార్యక్రమాలపై ఆలోచన సాగిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు ఆస్తి లాభాలు కలుగవచ్చు. అనుకూల రంగులు…….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…ఎరుపు. గణేశాష్టకం పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ముఖ్య వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు. ప్రయాణాలలో కొన్ని మార్పులు. మిత్రులు, బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహం కొంత తగ్గవచ్చు. ఉద్యోగులకు అదనపు భారం. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరిన్ని సమస్యలు. విద్యార్థులు నిర్ణయాలలో మరింత జాగ్రత్తలు పడాలి. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదిస్తారు. అనుకూల రంగులు……..నలుపు, లేత గులాబీ. ప్రతికూల రంగు…నీలం. కనకదుర్గాదేవిని పూజించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: