Today rashi phalalu – 14 మార్చి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొత్త రుణాలు అందుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు. కార్యక్రమాలు ఊహించని విధంగా మధ్యలోనే విరమిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు, సమస్యలు. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలలో ఆటంకాలు. విద్యార్థులకు మరింత శ్రమ తప్పదు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఎరుపు. గణపతిని ఆరాధించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం. కార్యక్రమాలు ఆటంకాలు తొలగి విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఆదాయం మీ అంచనాలకు తగినట్లు ఉంటుంది. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య. వ్యాపార, వాణిజ్యవేత్తలు సమస్యలు తీరి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు. విద్యార్థులకు నూతన విద్యలలో అవకాశాలు. మహిళలు మరింత సంతోషకరంగా గడుతారు. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ,గోధుమ. ప్రతికూల రంగు…నేరేడు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. చేపట్టిన కార్యక్రమాలను సజావుగానే సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. క్లిష్టమైన కేసులు కొన్ని పరిష్కారం. వాహన యోగం, వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. క్రీడాకారులు, వైద్యులకు ఊహించని పిలుపు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. మహిళలకు ఉద్యోగ యోగం. అనుకూల రంగులు……… గోధుమ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు ధ్యానం చేయడం ఉత్తమం.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఆకస్మిక ప్రయాణాలు సంభవం. బంధువులతో విరోధాలు. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. చిత్రపరిశ్రమవారు, వైద్యులకు మనస్సులో తెలియని ఆవేదన. విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ శివాలయ దర్శనం మంచిది.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కుటుంబ సభ్యులతో వైరం. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలతో కొంత అవస్థ పడవచ్చు. ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందికర పరిస్థితి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలపై ఆశలు తొలగుతాయి. ఉద్యోగులకు రోజువారి పనికంటే అధికంగా చేయాల్సిన పరిస్థితి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు గందరగోళం. విద్యార్థులకు అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు పరీక్షా కాలం. అనుకూల రంగులు……… నీలం, తెలుపు. ప్రతికూల రంగు…నలుపు. దత్తాత్రేయుని పూజించాలి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కార్యజయంతో ఉత్సాహం పెరుగుతుంది. మీ ప్రతిభను అందరూ ప్రశంసిస్తారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో అనుకూల వాతావరణం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో హుషారుగా పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఆహ్వానాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనుకూల రంగులు…. ఎరుపు,గోధుమ. ప్రతికూల రంగు..తెలుపు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. రావలసిన బాకీలు రాక నిరాశ చెందుతారు. బంధువులతో అకారణంగా విరోధాలు. ఇంతకాలం పడిన శ్రమ వృథాగా మారుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలకు విఘాతం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలు కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. అనుకూల రంగులు…. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. ఆంజనేయ దండకం పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు కొంత సఫలం. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. చిత్రపరిశ్రమ వారు, పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు రావచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. అనుకూల రంగులు…. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్చాలీసా పఠనం మంచిది.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఇంటాబయటా సమస్యలు నెలకొంటాయి. ముఖ్య అంచనాలు తప్పుతాయి. సన్నిహితుల నుంచి మాటపడతారు. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సర్వత్రా ఆందోళన. ఉద్యోగులకు ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు చిత్రమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…. తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కీలక మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులలో కొత్త ఆశలు. మహిళలకు కొన్ని ఇబ్బందులు తీరతాయి. అనుకూల రంగులు…. పసుపు, బంగారు. ప్రతికూల రంగు…కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


సమాజంలో మీ మాటే చెల్లుబాటు అవుతుంది. సన్నిహితులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. కార్యక్రమాలను సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ సత్తా చాటుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి కొంత నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూల రంగులు…. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. గణపతి స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. నిరుద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం మందగించి ప్రయాణాలు వాయిదా వేస్తారు. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని చిక్కులు. ఉద్యోగుల బదిలీ యత్నాలు ముందుకు సాగవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మానసిక అశాంతి. విద్యార్థులు అవకాశాలపై నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…. కాఫీ, ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. హనుమాన్ఛాలీసా పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: