Today rashi phalalu – 03 మార్చి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులు శత్రువులుగా మారే సూచనలు. వివాదాలు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలకు లోటు రాదు. ఉద్యోగులు ఇబ్బందులతో సతమతమవుతారు. రాజకీయవేత్తలు, రచయితలకు శ్రమాధిక్యం. విద్యార్థులు ఎంత కృషి చేసినా ఫలితం నామమాత్రం. మహిళలు కొన్ని నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడతారు. అనుకూల రంగులు……ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు సహాయం అందిస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయం దక్కి అవసరాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు కొన్ని తొలగుతాయి. రచయితలు, క్రీడాకారులకు ఆశించినస్థాయిలో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. మహిళలు శుభవార్తలు వింటారు. అనుకూల రంగులు…..గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. దుర్గా స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కార్యక్రమాలను కారణంగా లేకుండానే వాయిదా వేస్తారు. బంధువులతో కొంత విభేదిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు. ఆదాయం కొంత తగ్గవచ్చు. కాంట్రాక్టర్ల శ్రమ అంతగా అనుకూలించదు. వ్యాపార, వాణిజ్యవేత్తలు చికాకులతోనే గడుపుతారు. ఉద్యోగాల్లో అనుకోని చిక్కులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రతి విషయంపై ఆలోచన చేయాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……ఆకుపచ్చ, పసుపు. ప్రతికూల రంగు..గులాబీ. సూర్యాష్టకం పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం మీ ఊహలకు తగినట్లుగా ఉంటుంది. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను విస్తృతపరుస్తారు. ఉద్యోగాల్లో సమర్థత చాటుకుంటారు. రాజకీయవేత్తలు, వైద్యులకు శుభవర్తమానాలు. విద్యార్థుల్లో ఆనందం కనిపిస్తుంది. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అనుకూల రంగులు……లేత నీలం, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


కుటుంబసభ్యులతో తగాదాలు. కష్టపడ్డా పనులు ముందుకుసాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తల విస్తరణయత్నాలు నెమ్మదిస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థుల కృషి ఫలిచందు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…..గులాబీ, లేతనీలం. ప్రతికూల రంగు…తెలుపు. అంగారక స్తోత్రాలు పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ప్రణాళికాబద్ధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు ఆశించిన మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు శుభవర్తమానాలు రాగలవు. అనుకూల రంగులు……బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. గణేశాష్టకం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు రాగలవు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఎంతటి కార్యాన్ని అప్పగించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభవర్తమానాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. మహిళలకు సంతోషదాయకంగా ఉంటుంది. అనుకూల రంగులు……ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు..గులాబీ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మాటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త సమస్యలతో కుస్తీపడతారు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వివాదాలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొత్త చిక్కులు. మహిళలకు ఆరోగ్యభంగం. అనుకూల రంగులు……ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు..నేరేడు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


వ్యవహారాలలో కొన్ని అవరోధాలు. ఆరోగ్య సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువర్గంతో అకారణంగా విరోధాలు. రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు అంతగా లేక డీలా పడతారు. ఉద్యోగులు నిరాశతోనే గడుపుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలించవు. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. అనుకూల రంగులు……గులాబీ, గోధుమ. ప్రతికూల రంగు…పసుపు. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ఉత్సాహంగా కార్యక్రమాలు కొన్ని చేపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని పాతబాకీలను రాబట్టుకుని అవసరాలు తీర్చుకుంటారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ముందడుగు వేసి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. విద్యార్థులు కృషిని ముమ్మరం చేసి ఫలితం దక్కించుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. కనకదుర్గాదేవిని ఆరాధించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


మాటలతో కొందర్ని ఆకట్టుకుంటారు. ఒక వ్యక్తి ద్వారా సాయం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం మరింత పెరుగుతుంది. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……నీలం, నలుపు. ప్రతికూల రంగు..నేరేడు. శివ పంచాక్షరి పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ముఖ్యమైన కార్యక్రమాలలో కొద్దిపాటి అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు పనిభారం, ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, రచయితలకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు కుటుంబసమస్యలు. అనుకూల రంగులు……ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: