Today rashi phalalu – 11 మార్చి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. Check today horoscope in Telugu by renowned astrologer Vakkantham Chandramouli gaaru.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


నూతన వ్యక్తుల పరిచయాలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు, బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…….. గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. ఆదిత్య హృదయం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, భూయోగాలు. కొన్ని కోర్టు కేసుల నుంచి విముక్తి. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…….. పసుపు, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. శివ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆర్థిక ఇబ్బందులు. కార్యక్రమాలు ముందుకుసాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో అవాంతరాలు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు మరిన్ని చికాకులు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…….. గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…గోధుమ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో కొన్ని ప్రతిబంధకాలు. సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు, వైద్యచికిత్సలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమ వారికి శ్రమాధిక్యం. విద్యార్థులు అనుకున్న అవకాశాలు రాక డీలా పడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు…….. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


నిరుద్యోగుల కల ఫలిస్తుంది. కుటుంబంలో హఠాత్తుగా శుభకార్యాలు. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు నూతనోత్సాహం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు అన్నింటా శుభకరమే. అనుకూల రంగులు…….. గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూలరంగు…కాఫీ. గణపతిని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు సంభవం. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కష్టపడ్డా ఫలితం ఉండదు. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు…….. గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నీలం. శివాష్టకం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. కాంట్రాక్టర్లకు కలసి వచ్చే కాలం. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల దిశగా పయనిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. అనుకూల రంగులు…….. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హనుమాన్చాలీసా పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. బాధ్యతలు మరింత పెరిగి ఎటూపాలుపోనిస్థితిలో పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల విషయంలో తొందరవద్దు. ఉద్యోగాలకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మానసిక అశాంతి. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు అనారోగ్య సూచనలు. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు…నలుపు. నరసింహ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు రావచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…….. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…గోధుమ. హనుమాన్చాలీసా పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. సమాజసేవకు అంకితమవుతారు. ఆప్తుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింతగా సమృద్ధిగా లాభాలు రాగలవు. ఉద్యోగులకు ఉన్నతస్థితి యోగం ఉంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యుల యత్నాలు ఫలించే సమయంం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు……..నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..గులాబీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. కార్యక్రమాలు కొన్ని మధ్యలోనే విరమించాల్సిన పరిస్థితి. ప్రయాణాలలో ఆటంకాలు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు సవాలుగా మారవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి. మహిళలు కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అనుకూల రంగులు…….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. దూర ప్రయాణాలు ఉంటాయి. తీర్థ యాత్రలు చేస్తారు. బంధువులతో లేనిపోని విభేదాలు. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవేత్తలు, వైద్యుల కృషి ఎట్టకేలలు ఫలిస్తుంది విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనుకూల రంగులు…….. గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూలరంగు…నలుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: