11 మే 2025 - 17 మే 2025
జన్మ నక్షత్రం ప్రకారం

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

నూతన కార్యక్రమాలు చేపడతారు.

ఎంతటి సమస్యనైనా మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు.

ఒక ప్రమాదం లేదా సంఘటన నుండి తప్పించుకుంటారు.

వాహనాల విషయంలో కొంత నిదానం అవసరం.

చిన్ననాటి స్నేహితులతో చిన్ననాటి ముచ్చట్లు పంచుకుంటారు.

ఒక నిశ్చితాభిప్రాయంతో ముందడుగు వేస్తారు.

విజయాలు సొంతం చేసుకుంటారు.

విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రాగలవు..

నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆదాయం ఆశించినంతగా లభించే అవకాశాలున్నాయి.

ఇంత కాలం పడిన ఇబ్బందులు తీరే మార్గం ఏర్పడుతుంది.

రుణ విముక్తి లభిస్తుంది.

అన్నింటా కుటుంబ సభ్యులు చేదోడువాదోడుగా నిలుస్తారు.

మనోధైర్యంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

శుభకార్యాల సందడి నెలకొని అందులో నిమగ్నమవుతారు.

ఒకరి ఆరోగ్యం కొంత ఆదుర్దా పరుస్తుంది. చివరికి సర్దుబాటు కాగలదు.

కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

స్థిరాస్తులు కొనుగోలుకు సమాయత్తమవుతారు. వాహన సౌఖ్యం.

వ్యాపారులు లాభాలు మరింత ఆర్జిస్తారు.

కొత్త భాగస్వాముల చేయూతతో పెట్టుబడులు పెంచుతారు.

ఒక సందర్భంలో అధికారుల నుండి ఇబ్బందులు రావచ్చు.

చాకచక్యంగా వ్యవహరించండి.

ఉద్యోగస్తులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి.

ఎంతటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.

టెక్నాలజీ రంగం వారు, పారిశ్రామిక,రాజకీయవేత్తలకు విశేష ఆదరణ, ప్రోత్సాహం అందుతాయి.

మహిళలకు కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

దేవీ స్తోత్రాలు పఠించండి.

11 మే 2025 - 17 మే 2025
జన్మ తేది ప్రకారం

కర్కాటకం (21 జూన్ నుండి 22 జూలై)

నూతన వ్యక్తుల పరిచయాలు.

ఊహించని అవకాశాలు నిరుద్యోగులను సంతోషం కలిగిస్తాయి.

ఆదాయం సమృద్ధిగా ఉంటుంది.

శత్రువులను కూడా ఆకట్టుకుంటారు.

భూ వివాదాలు పరిష్కారమవుతాయి.

ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు.

సమస్యల పరిష్కారంలో చొరవచూపి సమర్థతను చాటుతాయి. యత్నకార్యసిద్ధి. బంధువుల రాకతో మరింత ఉత్సాహం.

దేవాలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు.

అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు.

వృత్తులు, వ్యాపారాల వారికి సమస్యల నుంచి ఉపశమనం.

కళాకారులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలమవుతాయి.

పరిశోధకులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

వారం మధ్యలో అనుకోని ఖర్చులు.

అనారోగ్యం. దూర ప్రయాణాలు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి