06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

ఉత్సాహవంతంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి అందిన ముఖ్య సమాచారం ఊరట కలిగిస్తుంది.

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరించడం విశేషం.

సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.

అనుకున్నంత ఆదాయం సమకూరడంతో అప్పులు చాలావరకూ తీరతాయి.

ఆస్తుల కొనుగోలుపై పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు కాస్త తొలగుతాయి. ఒక శుభకార్యం నిర్వహిస్తారు.

ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త పాటించండి.

వేళకు ఆహార విహారాదులు ముగించడం మంచిది.

వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు.

వ్యాపారాలు అభివృద్ధిపథంలో కొనసాగుతాయి.

భాగస్వాములతో మనస్పర్థలు తీరతాయి.

ఉద్యోగస్తులు అనుకున్న మార్పులు జరుగుతాయి.

విధి నిర్వహణలో ప్రశాంతత చేకూరుతుంది.

వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల సమయమనే చెప్పాలి.

టెక్నికల్ రంగం వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేస్తారు.

మహిళల యత్నాలు సఫలం.

సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరించండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి)

చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

దూర ప్రయాణాలు చేస్తారు.

ఒక సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ఆరోగ్య సమస్యలు తీరతాయి.

వాహనాలు ఇళ్ల కొనుగోలు చేస్తారు.

వ్యాపారులకు క్రమేపీ లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు ఇష్టమైన మార్పులు ఉండవచ్చు.

రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు.

కళాకారులు, పరిశోధకులకు తగిన గుర్తింపు తథ్యం.

వారం మధ్యలో మానసిక ఆందోళన.

కుటుంబంలో సమస్యలు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి