
07 జూన్ 2026 - 13 జూన్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.
విద్యార్థులు ప్రతిభ చాటుకునేందుకు తగిన సమయం.
కొన్ని సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కరించకుంటారు.
ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు.
శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
ఆదాయం ఆశించినంతగా దక్కుతుంది.బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆస్తుల ద్వారా కూడా కొంత సొమ్ము లభిస్తుంది.
కుటుంబంలో అందరూ ఇష్టపడతారు. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారం. సంతాన శుభకార్యాలు కొలిక్కి రాగలవు.
కొంత నలత తప్పదు. తరచూ ఆస్పత్రులు సందర్శిస్తారు.
ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొంత ఆస్తి కొనుగోలు చేసే వీలుంది.
వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి.
కొత్త పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు వేగవంతంగా పూర్తి చేస్తారు.
అందరి మెప్పు పొందుతారు.
క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలమే.
మహిళలకు శుభవర్తమానాలు.
టెక్నికల్ రంగం వారి యత్నాలు మరింత వేగం పుంజుకుంటాయి.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
07 జూన్ 2026 - 13 జూన్ 2026
జన్మ తేది ప్రకారం
అనుకున్న కార్యాలు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు.
మీ ఆలోచనలు అమలు చేస్తారు.
సమాజంలో మీకంటూ ప్రత్యేకత నిలుపుకుంటారు.
ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది.
ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు.
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఆశించిన ఆదాయం సమకూరుతుంది.
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. వాహనసౌఖ్యం.
విద్యార్థులు ఊహించని అవకాశాలు పొందుతారు.
వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.
వారారంభంలో దూర ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు.
Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి












