06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

నిర్ణయాలలో కొంత జాప్యం తప్పదు.

ఆలోచనలు ఎటూ తేలక సందిగ్ధంలో పడతారు.

వ్యతిరేకులను ఎలాగైనా మీవైపు ఆకర్షించాలన్న లక్ష్యం నెరవేరకపోవచ్చు.

కష్టపడ్డా ఫలితం కనిపించదు.

నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

మితిమీరిన విశ్వాసం వీడి వాస్తవాన్ని గ్రహించి ముందుకు సాగడం మంచిది.

ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు.

అనుకోని ఖర్చులు మీదపడి సతమతమవుతారు.

ఎంతగానో అభిమానించిన వారే సమస్యలు సృష్టించే వీలుంది.

బంధువులతో అకారణంగా తగాదాలు.

వివాహాది వేడుకలు కొన్ని వాయిదా పడొచ్చు.

భార్యాభర్తల మధ్య వివాదాలు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. తగ్గిందనుకున్న అనారోగ్యం తిరిగి చికాకు కలిస్తుంది.

ఆస్తుల కొనుగోలు పై ఎటూ తేల్చుకోలేరు.

ఒప్పందాలు సైతం వాయిదా వేస్తారు.

వ్యాపారాలలో నిదానంగా ముందుకు సాగడం మంచిది.

ప్రస్తుత పరిస్థితులు సవాలుగా మారతాయి.

ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు.

కళాకారులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులకు యత్నాలు ముందుకు సాగవు.

టెక్నికల్ రంగం వారికి అయోమయ పరిస్థితి ఉంటుంది.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

ఆంజనేయ దండకం పఠించండి.

06 సెప్టెంబర్ 2026 - 12 సెప్టెంబర్ 2026
జన్మ తేది ప్రకారం

వృషభం (20 ఏప్రిల్ నుండి 20 మే)

కొన్ని కార్యక్రమాలు చకచకా సాగుతాయి.

రాబడి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు.

స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం.

భూ, గృహయోగాలు.

మీ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు బంధువులు సహకరిస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు.

వ్యాపారస్తులు సంస్థలను విస్తరిస్తారు.

తగినంతగా లాభాలు ఆర్జిస్తారు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే సూచనలు.

కళాకారులకు అనుకోని ఆహ్వానాలు.

క్రీడాకారులు, పరిశోధకులకు ముఖ్య సమాచారం అందుతుంది.

వారం మధ్యలో అదనపు ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి