22 నవంబర్ 2026 - 28 నవంబర్ 2026
జన్మ నక్షత్రం ప్రకారం

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి ముఖ్యమైన  సమాచారం అందుతుంది.
కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విజయం సాధిస్తారు.
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు.
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.
ఇతరుల నుంచి ఊహించని రీతిలో సొమ్ము అందుతుంది.
రుణ బాధలు తొలగుతాయి.  కొత్త పొదుపు మార్గాలలో పెట్టుబడులు పెడతారు.
మీ పట్ల కుటుంబ సభ్యులంతా విశేష ప్రేమ చూపుతారు.
అలాగే, మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. వేడుకలపై చర్చిస్తారు. 
సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.
కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
వ్యాపారాలలో ఊహించని రీతిలో లాభాలు ఆర్జిస్తారు.
నూతన పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి.
రాజకీయ,పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
టెక్నికల్‌ రంగం వారికి శుభవార్తలు.
మహిళలకు అంచనాలు నిజమవుతాయి.
నృసింహ స్తోత్రాలు పఠించండి.

22 నవంబర్ 2026 - 28 నవంబర్ 2026
జన్మ తేది ప్రకారం

సింహం (23 జూలై నుండి 22 ఆగస్టు)
పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు.
పాత బాకీలు కొన్ని వసూలవుతాయి.
చేపట్టిన కార్యక్రమాలను శ్రమపడ్డా పూర్తి చేస్తారు.
భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం.
ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి.
చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.
ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు.
సోదరులు, సోదరీలతో విభేదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. వ్యాపారస్తులు ఆశించిన విధంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు కొంతమేర తగ్గే సూచనలు.
రాజకీయవేత్తలు, వైద్యులు, పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది.
మంచి గుర్తింపు సైతం లభిస్తుంది.
వారాంతంలో దూరప్రయాణాలు శారీరక రుగ్మతలు.

Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి